హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీలో విద్యార్ధి సంఘ ఎన్నికలు ఘర్షణ పరిస్థితులకు దారి తీశాయి… హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీలో విద్యార్ధి సంఘ ఎన్నికలు నిన్న జరిగాయి.ఎస్ఎఫ్ఐ ఫ్యానెల్ ఎన్నికల పోస్టర్లును ఎబివిపి కి చెందిన రాజేందర్ నాయక్,ఆకాశ్ బాటి,సిద్దం శుక్లా అనే విద్యార్ధులు చింపివేశారు.
ఈ పోస్టర్లను చింపవద్దని అడిగిన ఎస్ఎఫ్ఐ విద్యార్ధి ఆకాశ్ ను మద్యం మత్తులో విచక్షణ రహితంగా దాడి చేశారు.వారే కర్రలు,రాళ్ళతో యూనివర్శీటి హస్టల్ కీటికీ అద్దాలు ధ్వంసం చేశారు.
వారికి వారే అద్దాలను బ్రద్దలు కోట్టుకోని గాయాలు చేసుకోని ఎస్ఎఫ్ఐ దాడి చేసిందని ప్రకటించడం సిగ్గుమాలిన చర్య.
కరోనా సమయంలో విద్యార్ధులకు హస్టల్స్ ఇవ్వాలని ,యూనివర్శీటిలో ఉన్న హస్టల్స్, డిపార్ట్మెంట్ సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడింది.
ఏన్నికలకు ముందే నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ కూడా ఎబివిపి అడ్డుకున్నారు.అదే రోజు ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై దాడికి ప్రయత్నం చేశారు.మళ్ళీ ఎన్నికల ముందు ఈ చర్యకు పాల్పడారు.యూనివర్శీటీలో శాంతియుతంగా ఉన్న వాతవరణాన్ని ఎబివిపి ఉద్రిక్తంగా మార్చుతుంది.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో విద్యార్ధులపై ఎబివిపి దాడి చేస్తుంది.

ఒక్క హెచ్.సి.యు.లోనే కాదు గతంలో ఢిల్లీ జెఎన్యూలో,ఎ.ఎం.యు లో కూడా కర్రలు, కత్తులతో దాడి చేశారు.అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీలో శాంతియత వాతవరణం ,విద్యార్ధుల మద్య స్నేహాపూర్వక వాతవరణాన్ని ఎబివిపి రెచ్చగొట్టి చెడిపే ప్రయత్నం చేస్తుంది.
దళిత, సామాజిక విద్యార్ధుల కూటమితో ఎన్నికల్లో ఉన్న ఎస్ఎఫ్ఐ ఫ్యానెల్ పై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది.ఈ దాడిని విద్యార్ధులు, ప్రజాస్వామిక వాదులు,మేథావులు ఖండించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ కోరుతుంది.
ఈ ఘటన నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎబివిపి గుండాగిరి నశించాలని ఆందోళన కార్యక్రమాలకు ఎస్ ఎఫ్ ఐ పిలుపునిస్తుంది.







