సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కొన్నిటిని చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి.అందుకే వాటిని జనులు పదేపదే చూస్తూ వుంటారు.
తాజాగా ఆ రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేయడం గమనించొచ్చు.పాలు తీయడానికి ప్రయత్నించిన ఓ యువతిని చూసి.
నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు.విషయం తెలియాలంటే ఆ వీడియోలో ఏం జరిగిందో ఇక్కడ మీరు చదవాల్సిందే.
ఆ యువతికి తన దైనందిత జీవితంలో రీల్స్ చేయడం బాగా అలవాటు అయివుంటుంది.

ఓ గేదె వద్ద ముఖం పై ముసుగు వేసుకొని మరీ పాలు పితికే ప్రయత్నం చేస్తుంది.ముందుగా ఆ గేదెకు దగ్గరగా ఒక ప్లాస్టిక్ స్టూల్ వేసుకొని ఓ గిన్నె పట్టుకుని పాలు తీసేందుకు సిద్ధమవుతుంది.అప్పటికి గేదె తనకి ఎంతో ఇష్టమైన కుడితి నీళ్లు తాగుతూ ఉంటుంది.
ఇక ఆ యువతి.గిన్నె పట్టుకుని ఇలా పాలు పితికిందో లేదో.
అలా వెంటనే గేదె అలెర్ట్ అవుతుంది.అయితే ఇక్కడ రోజూ పాలు తీసే మహిళ ఆమె కాకపోవడంతో గేదెకి అర్ధం అయిపోతుంది.
ఎందుకంటే జంతువులకు స్పర్శను బట్టి యజమాని అవునా? కదా? అనే విషయం తెలుస్తుంది మరి.

అయితే ఇక్కడ అదే జరిగింది.యువతి చేష్టలను బట్టి గేదెకు అర్ధం అయిపోయింది.దాంతో తిక్క రేగి కాలితో ఒక్క తన్ను తన్నుతుంది.
అంతే దెబ్బకు ఆ యువతి అల్లంత దూరం వెళ్లి పడిపోతుంది.దాంతో ఇక ఈ జన్మలో పాలు పితకకూడదురా బాబోయ్! అని కుయ్యో మొర్రో అని ఏడుస్తుంది.
కాగా సదరు వీడియో మాత్రం నెటిజన్లకు కితకితలు పెడుతోంది.కాగా సదరు వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తే, కామెంట్లకు అయితే లెక్కేలేదు.
తింగరి పనులు చేస్తే.ఇలాగే ఉంటుంది.
అని కొందరు కామెంట్స్ చేస్తే, గేదె నీకు బాగా బుద్ధి చెప్పింది.ఇంకెప్పుడు ట్రై చెయ్యకు.
అంత ఈజీ కాదు.అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.







