అమెజాన్ అలెక్సా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.మారుతున్న టెక్నాలజీకి ఇదొక రూపకల్పనగా చెప్పుకోవచ్చు.
ఇపుడు అనేకమంది ఈ వర్చువల్ వాయిస్ అసిస్టెన్స్ వాడుకొని తమ పనులను తేలికగా మార్చుకుంటున్నారు.అయితే అమెజాన్ అలెక్సా అంటే అందరికీ గుర్తొచ్చేది ఫీమేల్ వాయిస్.
కానీ ఇక నుంచి మేల్ వాయిస్‌లో కూడా సేవలు లభించనున్నాయి.యూజర్ల ప్రశ్నలకు మగ గొంతుతో సమాధానాలు చెప్పగలదని అమెజాన్ ఇండియా తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.

అమెజాన్ ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేయడం విశేషం.అంతే కాకుండా అలెక్సాతో ముడిపడి ఉన్న కొన్ని డివైజ్‌లపై ప్రత్యేక ఆఫర్లను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది.అలెక్సా ఒరిజినల్ వాయిస్ నుంచి యూజర్లు ఈ మేల్ వాయిస్‌లోకి డివైజ్‌ని తేలికగా మార్చుకోవచ్చు.యూజర్లు అలెక్సా గొంతును మార్చాలని భావిస్తే.‘అలెక్సా చేంజ్ యువర్ వాయిస్’ అంటూ ఆదేశాలు పంపితే సరిపోతుంది.దీంతో దానంతట అదే తన గొంతును మార్చుకుని మేల్ వాయిస్‌లో అలెక్సా సేవలు అందిస్తుంది.

నోటిమాటతోనే కాకుండా మరొక విధంగా కూడా అలెక్సా వాయిస్‌ని మార్చేందుకు వీలుంది.మీ స్మార్ట్‌ఫోన్‌లో అలెక్సా యాప్‌ని ఓపెన్ చేసి ఇండివిడ్యువల్ డివైజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, చేంజ్ వాయిస్ అనే ఆప్షన్‌పైన క్లిక్ చేస్తే అలెక్సా వాయిస్ ఒరిజినల్(ఫీమేల్) నుంచి మేల్ వాయిస్‌లోకి మారుతుంది.కాగా అలెక్సాతో 2 భాషల్లో కనెక్ట్ కావొచ్చని అమెజాన్ ఇండియా ఈ సందర్భంగా వెల్లడించింది.ఇంగ్లిష్, హిందీ అడగవచ్చు.పైగా, అలెక్సాని కేవలం అలెక్సా అనే కాకుండా, ఈకో/ఎకో(Echo), కంప్యూటర్(Computer), అమెజాన్(Amazon) పదాలను ఉపయోగించి వర్చువల్ అసిస్టెన్స్ డివైజ్‌ని యాక్టివ్ లేదా వేకప్ చేయొచ్చని అమెజాన్ ఇండియా తెలిపింది.







