ఆటోలకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించాలి: నూనె వెంకట్ స్వామి

నల్లగొండ జిల్లా: కేసీఆర్‌ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల యొక్క ఆటోలకు ఏపీప్రభుత్వం లాగా ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చెల్లించి దేశానికే ఆదర్శంగా నిలవాలని పిఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.శుక్రవారం నకిరేకల్ లో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ దేశంలోనే అనేక పథకాలను అమలు చేయడంలో ముందున్నామని చెప్పే మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాగా ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ప్రతి సంవత్సరం వారి యొక్క ఆటోలకు ఇన్సూరెన్స్ పధకాన్ని అమలు చేసి ఆదుకుని

 Government Should Pay Insurance For Autos Nune Venkat Swamy,government , Insuran-TeluguStop.com

అప్పుడు దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.

ఆటో డ్రైవర్లకు ప్రధాన భారం ఆటోలకు ఇన్సూరెన్స్ కట్టడమేనని,ఇటీవల ఇన్సూరెన్స్ కంపెనీలు రేట్లు పెంచడం వలన సంవత్సరానికి 8 వేల నుండి 10 వేల రూపాయల వరకు చెల్లించవలసి వస్తోందని, ఆటో డ్రైవర్లపై ఇది పెనుభారంగా మారిందన్నారు.ఆటో బంధు” పధకాన్ని ప్రారంభించి ఆటో డ్రైవర్లను కేసీఆర్‌ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాచకొండ యాదగిరి గౌడ్, మాచర్ల సతీష్,కదిరె రమేష్,మహేశ్వరం సుధాకర్,కప్పల రాకేష్ గౌడ్,కొండ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube