టాలీవుడ్ యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒకరు.విజయ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ సమయంలోనే భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచు కున్నాడు.
అయితే గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ మరో హిట్ అందుకోలేక పోయారు.ఇటీవలే ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన లైగర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఈ సినిమా ఇచ్చిన షాక్ నుండి ఈ మధ్యనే విజయ్ బయట పడ్డాడు.ఆ తర్వాత తన లైనప్ ను ఇంట్రెస్టింగ్ గా సెట్ చేసుకుంటూ ప్లాప్స్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ప్రెజెంట్ విజయ్ దేవరకొండ లైనప్ లో ఉన్న సినిమా ‘ఖుషీ‘.ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్టర్ చేస్తున్నాడు.సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా గత కొన్ని నెలలుగా షూట్ ఆగిపోయింది.

మరి ఎట్టకేలకు ఈ సినిమా షూట్ అతి త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.ఇటీవలే మ్యూజిక్ సిట్టింగ్ కూడా వేయగా కొన్ని పిక్స్ వైరల్ అయ్యాయి.మరి విజయ్, సమంత ఎట్టకేలకు మళ్ళీ షూట్ లో పాల్గొన బోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్ మార్చి నెలలో స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.ఈ కొత్త షెడ్యూల్ కోసం టీమ్ అంతా విదేశాలకు పయనం అవ్వనుందట.

వస్తున్న సమాచారం ప్రకారం టీమ్ అంతా కలిసి నార్వే వెళ్లనుందట.అది కూడా రెండు రొమాంటిక్ సాంగ్స్ షూట్ కోసం అని తెలుస్తుంది.మరి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ సినిమాతో విజయ్-సమంత ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాల్సిందే.







