మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ -3 భూగర్భ గనిలో గ్యాస్ లీకైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.గనిలో మొదటి షిప్ట్ లో కార్మికులు పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది.
వెంటనే అప్రమత్తమైన సింగరేణి కార్మికులు బయటకు వచ్చేయడంతో పెను ప్రమాదం తప్పింది.అనంతరం సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ లీక్ కాకుండా చర్యలు చేపట్టారు.
.






