తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని రాజమండ్రి సబ్ జైలుకు ప్రత్యేక వాహనంలో గన్నవరం నుంచి తరలిస్తున్నారు.పట్టాభితో పాటు మరో పదిమందిని.
రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు.గన్నవరం సబ్ జైలులో ఉంచితే శాంతి భద్రతల సమస్య తలత్తే అవకాశం ఉందని జైలర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకురాగా ఆయన రాజమండ్రి జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ మేరకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు మధ్య పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకీ తరలిస్తున్నారు.

గన్నవరం పార్టీ కార్యాలయానికి సంబంధించి ఘర్షణల సమయంలో పట్టాభి రెచ్చగొట్టడం వల్లే సర్కిల్ ఇన్స్పెక్టర్, సీఐకీ గాయాలైనట్లు పోలీసు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం జరిగింది.ఈ పరిణామంతో పట్టాభితో పాటు మరో పదకొండు మందిపై హత్యాయత్నం కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది.అయితే పట్టాభి అరెస్టు పట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
పోలీస్ వ్యవస్థను వాడుకొని ఇష్టానుసారమైన తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.







