ఇండియాలోని ఫోన్ వాడకం గురించి మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు.ఇక్కడ ఫోన్ లేనిదే క్షణం గడవని మహానుభావులు చాలామంది వున్నారు.
అందులో మనం కూడా ఉన్నామేమో? ఇక ఇదే క్రమంలో ఇండియా సంవత్సరం సంవత్సరానికి మొబైల్ ఇంటర్నెట్ వాడకంలో ముందంజలో దూసుకుపోతోంది.దీనికి తలమానికంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ 5G వున్నాయి.
జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా సగటు మొబైల్ వేగంలో భారత్ 10 స్థానాలు ఎగబాకి, డిసెంబర్‌లో 79వ స్థానం నుంచి 69వ స్థానానికి చేరుకుంది అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు.
ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం, భారతదేశంలో సగటు స్థిర బ్రాడ్‌బ్యాండ్ వేగం, గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో దేశం 2 స్థానాలు ఎగబాకింది.గత సంవత్సరం కంటే మెరుగైన వేగంతో ఈ సంవత్సరం ముందుకు వెళ్తోంది.సగటు డౌన్‌లోడ్ వేగం 49.14 నుండి స్వల్పంగా పెరిగి, డిసెంబర్‌లో Mbps జనవరిలో 50.02 Mbpsకి ఎగబాకి సగటు మొబైల్ వేగంలో భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా 105వ స్థానాన్ని ఆక్రమించింది.ఈ సంవత్సరం జనవరిలో 29.85 Mbps సగటు మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను నమోదు చేయడం విశేషం.
మొత్తం గ్లోబల్ యావరేజ్ మొబైల్ స్పీడ్‌లో UAE అగ్రస్థానంలో వుంది.ఇక పాపువా న్యూ గినియా ప్రపంచ వ్యాప్తంగా తన ర్యాంక్‌ను 24వ స్థానానికి పెంచుకుంది.స్థిర బ్రాడ్‌బ్యాండ్ డౌన్‌లోడ్ వేగం కోసం, సింగపూర్ అగ్రస్థానాన్ని అధిరోహించడం కొసమెరుపు.అవును, సైప్రస్ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో 20 స్థానాలు ఎగబాకింది.ఇంతలో, రిలయన్స్ జియో ట్రూ 5G సేవలు 236 నగరాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి, తక్కువ సమయంలో ఇంత పెద్ద నెట్‌వర్క్‌ను చేరుకున్న మొదటి, ఏకైక టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది.