వైరల్: ఇలాంటి సినిమా షూటింగ్ మీరు జీవితంలో చూసుండరు... చూశారంటే పొట్ట చెక్కలే!

సోషల్ మీడియా అనేది నేడు అతి పెద్ద OTTగా మారింది.అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, రోజుకి ఇక్కడ లక్షల్లో వీడియో కంటెంట్ అప్లోడ్ అవుతుంది మరి.పైగా ఇక్కడ ఫ్రీగానే కంటెంట్ చూడొచ్చు.ఓ రకంగా చెప్పాలంటే ఇపుడు సోషల్ మీడియాలకు మంచి గిరాకీ వుంది.

 Viral You Will Never See A Movie Shooting Like This In Your Life, Cinema Shootin-TeluguStop.com

సగటున రోజుకి ఒక మనిషి దాదాపుగా నాలుగైదు గంటలు సోషల్ మీడియాలోనే ఉంటున్నాడని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.ఇక ఇక్కడ పోస్ట్ చేసిన కంటెంట్ గాని జనాలకి నచ్చితే క్షణాల్లో వైరల్ అయిపోతుంది.

తాజాగా అలాంటి ఓ వీడియో జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.

భారతదేశంలో ఏకైక ఎంటర్టైన్మెంట్ మాధ్యమం సినిమానే.అందుకే ఇక్కడ జనాలు సినిమా అంటే పడి చస్తారు.ఇక్కడ ఉన్నంత ఫ్యాన్ బేస్ మారే దేశంలో కూడా ఉండదంటే నమ్మశక్యం కాదేమో.

ఇక్కడ చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా.అందరూ సినిమాలను ఇష్టపడుతుంటారు.

ఈ క్రమంలో ఇక్కడ చాలామంది ఏకంగా సినిమాలు తీయాలని కలలు కంటూ వుంటారు.ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కుర్రాళ్లను గమనిస్తే వారు ఆ బాపతే అని చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో.నలుగురు కుర్రాళ్ళు చాలా ఫన్నీగా సినిమా షూటింగ్ చేస్తున్న దృశ్యాలను చూడవచ్చు.సినిమా షూటింగ్ లా రోల్, కెమెరా, యాక్షన్ అంటూ మొబైల్ తో వీడియో తీయడం ఇక్కడ చూడొచ్చు.యాక్షన్ అనగానే.మొబైల్ పట్టుకున్న బాలుడి కాళ్లను మరో బాలుడు లాగుతూ వీడియో షూట్ చేస్తున్నాడు.అదే సమయంలో ఎదురుగా మరో బాలుడు స్టైల్ గా నడిచి రావడాన్ని చూడవచ్చు.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ కాగా ఈ 12 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube