స్మార్ట్‌ఫోన్స్ కూడా అద్దెకి ఇస్తారా? అని ఆశ్చర్యపోకండి.మార్కెట్లో ఇలాంటి వెసులుబాట్లు అనేకం వున్నాయి.
కొన్ని సార్లు మీ దగ్గర ఫోన్ లేకపోతే ఫోన్ కొనడం కన్నా రెంట్‌కు తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు నిపుణులు.మార్కెట్లో పెద్ద పెద్ద బ్రాండ్లు అయినటువంటి యాపిల్ ఫోన్, శాంసంగ్, వివో, ఒప్పొ వంటి ఇతర బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్స్ అద్దెకు తీసుకోవచ్చు.
మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే.దానికంటే ముందు ఈ ఫోన్ రెంట్ తీసుకొని దాని గురించి ఎక్కువగా తెలుసుకోవడం ఉత్తమం.

ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఫోన్ కొంటే.ఒక నెల కల్లా అది పాతది అవ్వక మానదు.అదే విధంగా ఒకవేళ సదరు కంపెనీ మోడల్ పెద్ద మొత్తం కొన్నాక తీరా నచ్చకపోతే దాని విలువ అమాంతం పడిపోతుంది.బయటకి అమ్మేద్దామన్నా అందులో సగం ధరకే కొంటారు.
ఇంకో కొన్ని కొన్ని సార్లు పగిలిపోవచ్చు కూడా.ఇలా చెప్పుకుంటూ పొతే చాలా అంశాలు ఉంటాయి.
ఇలాంటివి ఏమీ లేకుండా మీరు అద్దెకు స్మార్ట్‌ఫోన్ తీసుకుంటే.మీకు నచ్చినన్ని రోజులు వాడుకోవచ్చు.
అలాగే ఆ మోడల్ తాలూకా ఫీచర్ల విషయంలో ఒక క్లారిటీ వస్తుంది.నచ్చితే అదే మోడల్ ఫోన్ కొనవచ్చు, లేదంటే మానేయొచ్చు.

అయితే ఫోన్‌ను అద్దెకు ఎవరు ఇస్తారు? అని అనుకుంటున్నారా? మీలాంటివారికోసమే “రెంట్ మోజో” అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఒకటి ఉంది.ఇది యూజర్లకు అద్దెకు స్మార్ట్‌ఫోన్స్, యాపిల్ ఫోన్లను ఇస్తోంది.శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 ప్లస్, యాపిల్ ఐఫోన్ 11 ప్రో, యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్, వన్‌ప్లస్ 7, శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, రెడ్‌మి కే20 ప్రో, యాపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, వన్‌ప్లస్ 7 ప్రో, యాపిల్ ఐఫోన్ ఎక్స్, ఒప్పొ ఎఫ్11 ప్రో, గూగుల్ పిక్సెల్ 2 వంటి పలు మోడళ్లను మీరు అద్దెకు తీసుకోవచ్చు.మీరు ఎంచుకునే స్మార్ట్‌ఫోన్ ప్రాతిపదికన మీ నెలవారీ అద్దె కూడా మారుతుంది.







