ఆయిల్ ధరలు రోజురోజుకీ వినియోగదారులపై దాడి చేస్తున్న తరుణంలో దేశంలోని వాహనదారులు మెల్లమెల్లగా EVల వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ క్రమంలో ఇపుడు ఏకంగా ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ ఇపుడు మన మర్కెట్లోకి వాక్సిసింది.
మద్రాస్‌కు చెందిన స్టార్టప్ ఇప్లేన్ కంపెనీ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ నమూనాను తయారు చేసింది.ఇది హెలీకాప్టర్ కన్నా వేగంగా ప్రయాణిస్తుంది భోగట్టా.
ఈ స్టార్టప్ బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ప్రదర్శనలో దీన్ని ఆవిష్కరించింది.పట్టణ ప్రాంతంలో వీటి ద్వారా వేగంగా సులభంగా ప్రయాణం చేయొచ్చు.

దీనిని ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 200 కిలోమీటర్లు మేర ప్రయాణిస్తుంది భోగట్టా.ఈ ఫ్లయింగ్ ట్యాక్స్ సాధారణ కార్లతో పోలిస్తే. 10 రెట్లు ఎక్కువ స్పీడ్‌తో వెళ్తుందని స్టార్టప్ చెబుతోంది.ఇక ఉబెర్‌లో ప్రయాణంచే చార్జీలతో పోలిస్తే.ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ చార్జీలు రెండు రెట్లు ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది.ఇప్లేన్ కంపెనీ CEO ప్రంజాల్ మెహతా, స్టార్టప్ సీటీవో ప్రొఫెసర్ సత్య చక్రవర్తి మాట్లాడుతూ.
ఎలక్ట్రిక్ గ్రౌండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌పై తీసిన వీడియో చూస్తున్నప్పుడు ఈ ఐడియా తనకి వచ్చినట్టు చెప్పుకొచ్చాడు.

ల్యాండ్, అలాగే టేకాఫ్ కావడం కోసం ఈ ఫ్లయింగ్ ట్యాక్సీకి పెద్దగా స్థలం అవసరం లేదట.కేవలం 25 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటే సరిపోతుంది అని అంటున్నారు.దీనికి నాలుగు ఫ్యాన్స్ ఉంటాయి.
ఇందులో ఇద్దరు కూర్చోవచ్చు.దీని టాప్ స్పీడ్ గంటకు 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
ఇవి దాదాపుగా 457 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలవు.ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ అనేది పట్టణాల్లో ప్రయాణం చేయడానికి అనువుగా ఉంటుంది.
ఈ మోడల్‌ను డెవలప్ చేయడానికి ఇప్లేన్ కంపెనీ దాదాపు 1 మిలియన్ డాలర్లు వెచ్చించిందని తెలుస్తోంది.ప్రస్తుతానికి అయితే దీన్ని ఆపరేట్ చేయడానికి ఒక పైలెట్ అవసరం.
అయితే భవిష్యత్‌లో అటానమస్ టెక్నాలజీతో దీన్ని అప్‌డేట్ చేయనుంది.







