ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో పాటు, డిజిటల్ సేవలు అందుబాటులోకి సైబర్ నేరగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది.ఒకవైపు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగాలు ఎంత అవగాహన కల్పిస్తున్న కూడా సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.
రకరకాల టెక్నాలజీని వినియోగిస్తూ ఫోన్ హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.దీనిపై కసరస్తు చేసిన శాంసంగ్ కంపెనీ ఒక కొత్త ఫీచర్ ను మెసేజ్ గార్డ్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది.
శాంసంగ్ మొబైల్లో బిల్డ్ ఇన్ సెక్యూరిటీ ఫేస్ ఫేస్ ఫీచర్ అందిస్తుంది.

ఇక ఆండ్రాయిడ్ మొబైల్ లో పరిస్థితి అయితే మరీ దారుణం ఏదైనా నోటిఫికేషన్ వచ్చిన, ఏదైనా లింకు వచ్చిన, ఏదైనా మెసేజ్ ఓపెన్ చేసి జస్ట్ క్లిక్ చేయడంతోనే ఫోన్ హ్యాక్ అయ్యేలా డిజైన్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు.ఈ సమస్యకు చెక్ పెట్టడం కోసమే శాంసంగ్ మెసేజ్ గాడ్ సెక్యూరిటీ ఫీచర్ ని డెవలప్ చేసి అందుబాటులోకి తెచ్చింది.
ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే ఫోన్ కు వస్తున్న మెసేజ్ లు, ఇమేజ్ లు, ఇంకా ఇతర లింకులను ఓపెన్ చేయడానికి ముందే బ్యాక్ గ్రౌండ్ మొత్తం స్కాన్ చేస్తుంది.
ఒకవేళ అది సైబర్ కేటుగాళ్ల వల అయితే ఓపెన్ అవ్వడాన్ని నియంత్రిస్తుంది.

అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ శాంసంగ్, గూగుల్ మెసేజెస్ యాప్ లకు పని చేస్తుంది.త్వరలో ఈ ఫీచర్ ను మరింత డెవలప్ చేసి వాట్సాప్ వంటి యాప్ లకు కూడా పనిచేసేలా చేస్తామని కంపెనీ వెల్లడించింది.మొదట ఈ ఫీచర్ ని గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్లలో చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ముఖ్యంగా ఈ ఫోనును కొనుగోలు చేసిన వారు మాత్రమే ఈ ఫీచర్ ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.త్వరలో ఈ ఫీచర్స్ ని అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లతో గూగుల్ ఇంటిగ్రేట్ చేస్తుందని తెలిపింది.
ఈ ఫీచర్ నిపుణులు స్వాగతించారు.







