నందమూరి తారకరత్న భౌతికంగా దూరమై విషాదం మిగిల్చాడంటూ ఆయన శ్రేయోభిలాషులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న మృతి చెందారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.తారకరత్నను బ్రతికించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు.
తారకరత్న ప్రతిభావంతుడు అని ఎంతో ఆప్యాయంగా ఉండేవాడని చిరంజీవి పోస్ట్ లో పేర్కొన్నారు.తారకరత్న కన్నుమూయడం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు.తారకరత్న ఆశలు నెరవేరకుండా తుదిశ్వాస విడవటం దురదృష్టకరం అని పవన్ చెప్పుకొచ్చారు.బావా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక వినిపించదంటూ నారా లోకేశ్ ఎమోషనల్ అయ్యారు.
తారకరత్న మృతి టీడీపీకి తీరని లోటు అని లోకేశ్ తెలిపారు.

అయితే తారకరత్న అంత్యక్రియలకు సంబంధించి కీలక వివరాలు వెల్లడయ్యాయి.ఈరోజు ఉదయం తారకరత్న మృతదేహాన్ని మోకిలలోని ఇంటికి తరలించనున్నారు.సోమవారం రోజున తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న మృతదేహాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సందర్శనార్థం ఉంచనున్నారు.
సోమవారం సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.

మరో రెండు రోజుల్లో తారకరత్న పుట్టినరోజు కాగా పుట్టినరోజుకు రెండు రోజుల ముందు తారకరత్న మృతి చెందడం గమనార్హం.రాజకీయాల్లో సక్సెస్ సాధించాలని అనుకున్న తారకరత్న ఆ విషయంలో అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు.ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న తారకరత్న మృతి చెంది అభిమానులకు బాధను మిగిల్చారు.
తారకరత్న పరిచయమే ఒక సంచలనం కాగా సరైన డైరెక్టర్లను ఎంచుకుని ఉంటే తారకరత్న స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించి ఉండేవారని చాలామంది భావిస్తారు.ఇచ్చిన మాటకు తారకరత్న కట్టుబడి ఉండేవారని సమాచారం అందుతోంది.







