నల్లగొండ జిల్లా:శివరాత్రి పర్వదినాన్ని పురస్కించుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగి పోయాయి.ప్రముఖ శివాలయాల్లో తెల్లవారు జామున నుండే భక్తులు పోటెత్తడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలయ కమిటిలు,అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో శివ లింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.