తెలంగాణ దళిత సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ 84 వ వర్ధంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:భాగ్యరెడ్డి వర్మ 84 వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన జీవిత పాఠం బహిరంగ బోధన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని స్వేచ్ఛ జేఏసి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని సాయిగౌతమి జూనియర్ కాలేజీలో వర్ధంతి వేడుకలను స్వేచ్ఛ జేఏసి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పి.డి.

 Telangana Dalit Reformer Bhagya Reddy Verma's 84th Birth Anniversary Celebration-TeluguStop.com

ఎస్.యు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోలేబోయిన కిరణ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం పివైఎల్ జిల్లా కార్యదర్శి కునుకుంట్ల సైదులు,దళిత బహుజన మహాసభ కన్వీనర్ నారబోయిన వెంకట్,ఎల్.

పి.హెచ్.ఎస్ రాష్ట్ర నాయకులు నాగేందర్ లు మాట్లాడుతూ తెలంగాణ దళిత సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ మాదరి వెంకయ్య రంగమాంబలకు 1888 మే 22 జన్మించి,1939 ఫిబ్రవరి 18 న క్షయవ్యాధితో మరణించాడని అన్నారు.భాగ్యరెడ్డి 1906లో షెడ్యూల్డు కులాల బాలబాలికలకు విద్యను నేర్పడం కోసం హైదరాబాదులోని ఈసామియా బజారులో జగన్మిత్ర మండలిని స్థాపించాడని, హరిజనులలో విద్యావశ్యకతను గుర్తించి 1910వ సంవత్సరంలో జగన్మిత్ర మండలి ఆధ్వర్యంలో మొదటి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారని గుర్తు చేశారు.

భాగ్యరెడ్డి వర్మ అంటరాని కులాల ఉద్దరణకై 1911లో మన్యసంఘాన్ని ఏర్పాటుచేశాడని,అప్పటి నుండి జగన్మిత్ర మండలి యొక్క కార్యకలాపాలు మన్యసంఘం ద్వారా కొనసాగించాడని అన్నారు.మన్యసంఘం అంటరాని కులాల ప్రజల్లో సాహిత్యం,హరికథలు, ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావటానికి ప్రయత్నించిందని తెలిపారు.

కొంతమంది ఉన్నత కులాల హిందువులు కూడా ఈ భజన మండళ్లను ప్రోత్సహించారని, మన్యసంఘం ఆధ్వర్యంలో ఈ భజన మండళ్లు రీడింగ్ రూములు ఏర్పరచి అందులో ఆంధ్రప్రత్రిక, దీనబంధు మొదలైన పత్రికలను అందుబాటులో ఉంచాయన్నారు.ఈ సంస్థ బాల్య వివాహాలను నిర్మూలించడం,దేవదాసి, జోగిని వంటి దురాచారాలు నిర్మూలించడం కోసం పనిచేసిందన్నారు.

ఈ సంస్థ కృషివల్ల నిజాం దేవదాసి వ్యవస్థను నిర్మూలించాడన్నారు.ఒక దశాబ్దం తర్వాత 1921లో మన్యసంఘం యొక్క పేరును మార్చి ఆది-హిందూ సోషల్ సర్వీసు లీగ్ అని నామకరణం చేశారన్నారు.1917లో విజయవాడలో భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆంధ్ర పంచమ మహాజనసభ,తొలి ఆది ఆంధ్ర మహాజనసభగా రూపాంతరం చెందిందని,అందులో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్ష ప్రసంగం చేస్తూ ఏ హిందూ పురాణ, ఇతిహాసాల్లోనూ పంచములనే పదం లేదని, ఈ ప్రాంతానికి మొట్టమొదటి నుండి స్థానికులైన ప్రజలు పంచములే కాబట్టి, ఇప్పటి నుండి ఆది ఆంధ్రులనే వ్యవహారం సరైనదని తీర్మానించాడన్నారు.

1917 నుండి 1938 వరకు ఆది ఆంధ్రమహాసభలు దాదాపు ప్రతి సంవత్సరం జరిగాయన్నారు.

అంటరానివారిని ఆది హిందువులుగా పిలవాలని డిమాండు చేశారన్నారు.ఈ ఆది ఆంధ్ర మహాజనసభల ప్రభావంతో 1931 జనాభా లెక్కలలో మాల,మాదిగ, ధేర్,చమర్ లాంటి వారికి నిజాం ప్రభుత్వం ఆదిహిందువులుగా పేర్కొన్నదని అన్నారు.

వారి ఆశయ సాధన కోసం మనం కృషి చేయాలిని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్,మనోజ్,సంపత్, రాకేష్,రవి,మనోజ్, పరమేష్,సందీప్,వంశీ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube