ఆపిల్ పండ్లు తినడం మంచిదే కానీ.. ఆ సమయంలో మాత్రం..

ఆపిల్ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని దాదాపు చాలా మంది ప్రజలకు తెలుసు.ఆపిల్ లో మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

 It Is Good To Eat Apples But At That Time ,apple, Health , Health Tips , Night ,-TeluguStop.com

అందుకే ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లవలసిన అవసరం లేదని చెబుతూ ఉంటారు.అయితే ఆపిల్ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి.

ఈ పండును సంపూర్ణ పోషణను ఇచ్చే ఆహారంగా చెప్పవచ్చు.అయితే ఈ పండు తినకూడని సమయం కూడా ఉంది.రోజులో ఎప్పుడైనా ఆపిల్ పండు తినవచ్చు.కానీ రాత్రి పూట మాత్రం తినవద్దని ఆహార నిపుణులు చెబుతున్నారు.

దానికి కారణం ఈ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది.ఫైబర్ అధికంగా ఉండే ఈ పండును రాత్రి పూట తింటే జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.

Telugu Apple, Fiber Foods, Gastric Problem, Tips-Telugu Health

దీని వల్ల అజీర్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.జీర్ణ వ్యవస్థ కు ఆటంకం కలగవచ్చు.ఆపిల్ పండు తో పాటు రాత్రి పూట ఇతర ఆహారాలు కూడా సరిగ్గా జీర్ణం కావు.దీని వల్ల గ్యాస్, మల బద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

కాబట్టి రాత్రి పూట ఆపిల్ పండు తినే అలవాటును వదులుకోవడం మంచిది.

Telugu Apple, Fiber Foods, Gastric Problem, Tips-Telugu Health

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఈ పండు తినడం ఆరోగ్యానికి మేలు.ఆపిల్ పండు రాత్రి పూట తినడం వల్ల కలిగే చిన్న ఇబ్బంది ఇదే కానీ కొందరిలో ఆ చిన్న ఇబ్బంది కూడా పెద్ద సమస్యగా మారుతుంది.అందుకే పోషకాహార నిపుణులు రాత్రి పూట ఆపిల్ తినడం మానేయడమే మంచిదని చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆపిల్ ను రాత్రిపూట తినకపోవడమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube