పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో ఏ హీరోకి లేదు అని చెప్పటం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయిన ఎందుకు ఆయనకి అంత క్రేజ్ ఉందో ఎవరికి తెలీదు ఆయనకి సినిమా పరంగా ఫ్యాన్స్ అయిన వాళ్ళు కొంత మంది అయితే వ్యక్తిగతంగా ఆయన కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలా మందే అని చెప్పవచ్చు…ఆయన చాలా మంది ఆర్థికం గా సహాయం కూడా చేశారు.
ఇప్పటికే ఆయన నుంచి సహాయం పొందిన వాళ్ళు చాలామందే ఉన్నారు.

ఒక ఇటు సినిమాల్లో హీరోగా చేస్తూనే ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలి అని తనకి తానే అనుకొని ఒక ఉద్యమంలా ముందుకు నడుస్తున్నాడు.ఆయన సినిమాలు చేస్తుంటే వచ్చిన డబ్బులతో జనాలకి సేవ చేస్తున్నాడు…ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు కమిట్ అయినప్పటికీ ఈ ఎలక్షన్స్ తరువాత పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రాబోతున్నాట్టూ తెలుస్తుంది.

ఎందుకంటే ఈ సారి జనసేన పార్టీ చాలా సీట్ల ని గెలిచే విధంగా పవన్ కళ్యాణ్ మరియు వాళ్ల పార్టీ శ్రేణులు కష్టపడుతున్నట్టు తెలుస్తుంది…ఈ సారి పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగా సీట్లు కనక వస్తె ఇక ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు మొత్తం కంప్లీట్ చేసి ఇక సినిమాలు తీయడం ఆపేస్తాడని ఇప్పటికే పవన కళ్యాణ్ సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది…ఈ విషయాన్ని అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారో…
.







