కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకప్పుడు విలన్ గా, కామెడీ విలన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు అలా చాలా రోజుల పాటు చేశాక, హీరోగా మారి వరస హిట్లు కొట్టి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.మోహన్ బాబు ఒకానొక సమయంలో స్టార్ హీరోలు గా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, నాగర్జున, వెంకటేష్ లకి తన సినిమాలతో మంచి పోటీ ఇచ్చాడు.
వరుసగా హిట్ సినిమాలు తీసి మోహన్ బాబు అంటే ఏంటో ఇండస్ట్రీ మొత్తానికి చూపించాడు.అలాంటి మోహన్ బాబు తరువాత తన కొడుకు అయిన మంచు విష్ణు హీరోగా విష్ణు అనే సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు అయినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు.
దాంతో మోహన్ బాబు విష్ణు కెరియర్ ని గాడిలో పెట్టాలని తానే దగ్గరుండి స్టోరీలు సెలెక్ట్ చేసినప్పటికీ అవేమీ పెద్దగా ఇంపాక్ట్ చుపించలేకపోయాయి.

అయితే శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఢీ సినిమా తో మంచి విజయాన్ని అందుకొని సక్సెస్ ట్రాక్ ఎక్కాడు ఇక అప్పుడు స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన వై వి ఎస్ చౌదరి డైరెక్షన్ లో సలీమ్ అనే సినిమా చేశాడు.ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా ప్లాప్ అయింది.అయితే ఈ సినిమా ప్లాప్ అయిన తరువాత ఈ సినిమా డైరెక్టర్ అయిన వై వి ఎస్ చౌదరి సలీమ్ సినిమా ప్రొడ్యూసర్ అయిన మోహన్ బాబు మీద చీటింగ్ కేస్ పెట్టాడు ఎందుకంటే తనకి ఇస్తాను అన్న రెమ్యూనరేషన్ సరిగా ఇవ్వలేదని అలాగే వాళ్ళు ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయిందంటు తను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు దాంతో మోహన్ బాబు కోర్టు కి హాజరై తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చినట్టు గా తెలుస్తుంది.
సినిమా ఇండస్ట్రీ లో సినిమాలు హిట్ అయినంత సేపు ఎవరితో ఏం ప్రాబ్లం ఉండదు ఒక్కసారి సినిమా ప్లాప్ అయ్యింది అంటేనే లెక్కలన్నీ మారిపోతాయి…
.







