చంద్రబాబు, లోకేశ్ లపై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.డబ్బుంటే సరిపోదన్న ఆయన లోకేశ్ కు ఖలేజా ఉండాలని తెలిపారు.
దమ్మున్న నాయకుడికి ప్రత్యక్ష ఉదహరణ జగన్ అని మంత్రి కొనియాడారు.లోకేశ్ పాదయాత్రపై మండిపడ్డ జోగి రమేశ్ నీదొక పాదయాత్ర… నువ్వొక లీడర్ వా అంటూ ఫైర్ అయ్యారు.
తండ్రీకొడుకులు ఇద్దరూ ఫ్రస్టేషన్ లో ఉన్నారని విమర్శించారు.కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేశ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దొడ్డిదారిలో మంత్రి అయిన చరిత్ర లోకేశ్ ది అంటూ ఆరోపణలు చేశారు.







