బొప్పాయి పంట సాగులో వైరస్, బ్యాక్టీరియా వల్ల తెగుళ్ల బెడద విపరీతంగా ఉంటుంది.సరియైన క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెట్టుబడి తగ్గడంతో పాటు అధిక దిగుబడి పొందవచ్చు.
బొప్పాయి పంట తొమ్మిది నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు కాపు ఇస్తుంది.బొప్పాయి పంటలో తెగుళ్లు ఎక్కువగా చెట్టు మొదల నుంచి వ్యాపించే అవకాశాలు ఎక్కువ.
మరి దీనిని నివారించడానికి చెట్టు మొదల్ల వద్ద నీరు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి.ముఖ్యంగా వానాకాలంలో చెట్టు మొదల వద్ద నీరు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకోవాలి.

కాపర్ ఆక్సీ క్లోరైడ్ ను లీటరు నీటిలో మూడు గ్రాములు వేసుకొని బొప్పాయి చెట్టు మొదల వద్ద వేస్తే తెగుళ్లు వ్యాపించవు.ఇక బొప్పాయి కాయలు కోతకు వచ్చే సమయానికి మిథైల్ యూజినల్ ఎర్రబుట్టలను వినియోగించాలి.ఎందుకంటే కాయలు కూతకొచ్చే సమయంలో ఈగలు ఎక్కువగా వచ్చి నష్టాన్ని కలిగిస్తాయి.మిథైల్ యూజినల్ తో ఈగల బెడద ఉండదు.ఇక లీటరు నీటిలో రెండు మిల్లీమీటర్ల ప్రొఫెనోపాస్ కలిపి పంటకు పిచికారి చేసినట్లయితే తెల్ల దోమ, రసం పీల్చే పురుగులు, పెనుబంక, మోజాయిక్, రింగ్ స్పాత్ వంటి తెగుళ్లు రాకుండా పంటను కాపాడుకోవచ్చు.

ఎప్పటికప్పుడు బొప్పాయి పంటను పరిశుభ్రంగా ఉంచుకుంటే వైరస్, బ్యాక్టీరియా వంటివి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉండదు.ముఖ్యంగా పసుపు రంగు జిగురు అట్టలను పెట్టడం ద్వారా ఈగలు, తెల్ల దోమల, కీటకాల బెడద ఉండదు.సుదోమోనస్ ఫోరిసెన్స్ నాలుగు గ్రాములు, కార్బో ఫ్యూరాన్ 3జి గుళికలు, 250 గ్రాముల వేప పిండి ని చెట్టు మొదల వద్ద వేసినట్లయితే నులి పురుగుల సమస్యను అరికట్టవచ్చు.
పై పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తే ఎటువంటి తెగుళ్లు బొప్పాయి పంటకు సొకకుండా అధిక దిగుబడి పొందవచ్చు.







