టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ ని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ సమంత తెలుగు సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టి చాలా సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ ఇమేజ్ కలిగి ఉంది.ఈ ముద్దుగుమ్మ సమంత ఏప్రిల్ నెలలో తన శాకుంతలం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయం తెల్సిందే.
ఆ సినిమా కేవలం తెలుగు లోనే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం మరియు హిందీ లో కూడా విడుదల కాబోతుంది.ఈ మధ్య కాలం లో పౌరాణిక సినిమాలకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
అందుకే శాకుంతలం సినిమా అక్కడ కాస్త ఎక్కువగానే మార్కెట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.

పైగా సమంత కి ఈ మధ్య కాలం లో హిందీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పెరిగింది. ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తర్వాత సమంత యొక్క ఆదరణ అక్కడ భారీగా పెరగడం తో పాటు అక్కడ మార్కెట్ కూడా పెరిగింది.ప్రస్తుతం హిందీలో సమంత సినిమాలు మరియు సిరీస్ లు కూడా వరుసగా చేస్తున్న విషయం తెల్సిందే.
అందుకే శాకుంతలం సినిమా యొక్క హిందీ డబ్బింగ్ రైట్స్ కి మంచి డిమాండ్ ఉందని తెలుస్తోంది.

గుణ శేఖర్ మంచి నిర్మాణ విలువలతో ఈ సినిమా ను రూపొందించడంతో కచ్చితంగా హిందీ ప్రేక్షకులు సినిమా ను ఆస్వాదిస్తారని అక్కడి నిర్మాతలు భావిస్తున్నారు.అందుకే దాదాపుగా పాతిక కోట్ల రూపాయల ను శాకుంతలం హిందీ డబ్బింగ్ రైట్స్ కి పెట్టేందుకు పలువురు డిస్ట్రిబ్యూటర్లు మరియు చిన్న హిందీ సినిమాల నిర్మాతలు ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది.ఒక సౌత్ ఇండియన్ లేడీ ఓరియంటెడ్ మూవీ ఏకంగా 25 కోట్ల రూపాయల బిజినెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఇదే కనుక నిజమైతే కచ్చితంగా సమంత గ్రేట్ అంటూ సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.అతి త్వరలోనే శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మళ్లీ మొదలవ్వబోతున్నాయి.







