మారుతి జిమ్నీ… ఇపుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఈ పేరే వినబడుతోంది.అవును, 2023 ఆటో ఎక్స్‌పోలోకి వచ్చిన మారుతి సుజుకి యొక్క 5 డోర్స్ జిమ్ని ఇపుడు వాహన ప్రేమికులను మెప్పించడంలో ముందంజలో వుంది.
కంపెనీ SUV కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం స్టార్ట్ చేయగా, బుకింగ్స్ ప్రారంభమైన మొదటిదశలోనే అద్భుతమైన బుకింగ్స్ చేసి రికార్డ్స్ సృష్టించింది.జిమ్ని బుకింగ్స్ ప్రారంభమైన రెండు రోజులకే ఏకంగా 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొంది సత్తా చాటిన సంగతి అందరికీ తెలిసినదే.

దాంతో కంపెనీ బుకింగ్ ధరలు బాగా పెంచేస్తోంది.అయినప్పటికి బుకింగ్స్ పెరగడం విశేషమే.దీన్ని బట్టి చూస్తే మారుతి 5 డోర్స్ జిమ్నికి మార్కెట్లో ఎంత డిమాండ్ వుందో అర్ధం చేసుకోవచ్చు.కాగా కంపెనీ ఈ SUV ని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అధికారికంగా విడుదల చేసే అవకాశం కలదు.
ఇక ఆరోజే SUV ధరలు కూడా ప్రకటించనుంది.మారుతి సుజుకి 5 డోర్స్ జిమ్నీ కొనాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ యొక్క Nexa డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.
కాగా జిమ్నీ SUV రెండు వేరియంట్స్ లో లభిస్తుంది.అవి జీటా మరియు ఆల్ఫా.అంతే కాకుండా ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ తో అందించే అవకాశం కూడా ఉంటుంది.

ఇక మారుతి జిమ్నీ ఫీచర్స్ గురించి ఒకసారి చూస్తే… 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే కింద మ్యాన్యువల్ బటన్లు ఉంటాయి.రెండవ వరుస ప్రయాణికుల కోసం బాటిల్ హోల్డర్స్ మరియు ఛార్జింగ్ సాకేట్ వంటివి అందుబాటులో ఉంటాయి.5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్ కలిగి వుంది.ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది.
మరిన్ని వివరాలకు కంపెనీ వెబ్ సైట్ చూడగలరు.







