మెగాస్టార్‌ పాటకు అదిరిపోయే డ్యాన్స్‌ చేసిన PV సింధు!

పూసర్ల వెంకట సింధు… గురించి తెలుగువాళ్ళకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆమె ఒక పేరు పొందిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.2016లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా అప్పట్లో సంచలం సృష్టించింది.అదేవిధంగా టోక్యో 2020 ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకుని భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.2013 ఆగస్టు 10న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించడం ద్వారా ఆ పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా కూడా చరిత్ర సృష్టించింది.ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టే అవుతుంది.

 మెగాస్టార్‌ పాటకు అదిరిపోయే -TeluguStop.com

ఇకపోతే సింధు ఆటలోనే కాదు డ్యాన్స్‌ కూడా ఈమధ్య ఇరగదీస్తోంది.సోషల్ మీడియాలో సింధు ఎప్పటికప్పడు యాక్టివ్ గా ఉంటుంది.ఈక్రమంలోనే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు కెరీర్‌ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.అప్పుడప్పుడూ సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తూ ఆ వీడియోలను పంచుకుంటుంది.తాజాగా మరోసారి తన డ్యాన్సింగ్‌ ట్యాలెంట్‌ను చూపించింది ఈ ముద్దుగుమ్మ.అవును, మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘బాసు.

వేర్ ఈజ్ ద పార్టీ’ హుషారుగా స్టెప్పులేసి ఇరగదీసింది.

ప్రస్తుతం ఈ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా నెటిజన్లు విపరీతంగా షేర్లు చేస్తున్నారు.ఇక ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోపే 2.9 లక్షలకు పైగా లైక్స్ సంపాదించుకుందంటే మాటలా? ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.‘సింధూ. మీ డ్యాన్సింగ్‌ ట్యాలెంట్‌ అదుర్స్‌’ అని ఒకరంటే, ‘నిన్ను త్వరలోనే టాలీవుడ్‌లో చూడాలనుకుంటున్నాం’ అని కొందరు, ‘మీతో ఓ స్టెప్ వేయాలని వుంది’ అని కొందరు ఇలా ఎవరికి తోచిన కామెంట్ వారు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube