తారకరత్న హెల్త్ అప్ డేట్ ఇదే.. ఆ సమస్య నుంచి ఇంకా కోలుకోలేదంటూ?

నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలని చాలామంది అభిమానులు ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన అప్ డేట్ వచ్చింది.

 Nandamuri Hero Tarakaratna Health Update Details Here Goes Viral , Tarakaratna H-TeluguStop.com

తారకరత్నకు ఈరోజు ఉదయం వైద్యులు బ్రెయిన్ స్కాన్ చేశారని సమాచారం.విదేశీ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు ప్రస్తుతం చికిత్స జరుగుతోందని తెలుస్తోంది.

తారకరత్న బ్రెయిన్ ఫంక్షన్ ను మెరుగుపరచి ఆయనను కోమాలో నుంచి బయటకు తీసుకొనిరావాలని వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది.గతంతో పోల్చి చూస్తే ఆయన చికిత్సకు వేగంగానే స్పందిస్తున్నారని బోగట్టా.

బాలయ్య సైతం షూటింగ్ లు ఆపేసి తారకరత్న ఆరోగ్యం కోసమే పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

Telugu Brain Scan, Heart Attack, Tarakaratna-Movie

39 సంవత్సరాల వయస్సులోనే తారకరత్న గుండెపోటుకు గురి కావడం ఆయన ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.షుగర్ లెవెల్స్ అంతకంతకూ పెరగడం వల్లే ఆయన ఈ సమస్య నుంచి కోలుకోవడం కష్టమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తారకరత్న పూర్తిస్థాయిలో కోలుకున్నారనే శుభవార్తను ఎప్పుడు వింటామో చూడాల్సి ఉంది.

ఆయన త్వరగా సాధారణ మనిషి కావాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

Telugu Brain Scan, Heart Attack, Tarakaratna-Movie

సినిమా రంగంలో తారకరత్న ఆశించిన విజయాలను సొంతం చేసుకోలేకపోయినా మంచి సినిమాలలో నటించారని ఆయనకు పేరుంది.నందమూరి హీరోలతో కలిసి నటించి తారకరత్న భావించారు.ఆ అవకాశం వచ్చిన సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు.

బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీలో కీలక పాత్ర కోసం తారకరత్న పేరును పరిశీలించారని సమాచారం.తారకరత్న త్వరగా సాధారణ మనిషి కావాలని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా భావిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ మూవీ తాజాగా థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube