‘NC22’ : ఒక్క సాంగ్ కోసం 7 సెట్స్.. చైతూపై భారీ రిస్క్!

అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య ఒకరు.ఈయన ఎంట్రీ ఇవ్వడం ప్లాప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత మాత్రం మంచి హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు.

 Naga Chaitanyas Film With Venkat Prabhu-TeluguStop.com

వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్న చైతన్య మళ్ళీ ఇటీవలే వచ్చిన ‘థాంక్యూ‘ సినిమాతో మాత్రం ప్లాప్ అందుకున్నాడు.ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ చైతూ రేసులో వెనుక బడ్డాడు.

Telugu Krithi Shetty, Naga Chaitanya, Tollywood, Venkat Prabhu-Movie

అంతే కాదు నాగ చైతన్య హిందీ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చద్దా కూడా ప్లాప్ అవ్వడంతో ఈయన మిగతా సినిమాలపై కూడా ప్రభావం పడుతుంది.ఆ సినిమాల బిజినెస్ తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.కానీ ఇక్కడ పరిస్థితి చుస్తే వేరేలా ఉంది.నాగ చైతన్య నెక్స్ట్ మూవీపై భారీ బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్.ఒకవైపు వరుసగా రెండు ప్లాప్స్ వచ్చి వెనుకబడ్డ నాగ చైతన్య సినిమాకు ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టడం పలువురిని ఆశ్చర్య పరుస్తుంది.

Telugu Krithi Shetty, Naga Chaitanya, Tollywood, Venkat Prabhu-Movie

నాగ చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా ‘కస్టడీ’.తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా కలిసి నటిస్తున్నారు.తమిళ్, తెలుగులో ఏకకాలంలో తెరకెక్కుతుంది.

దీంతో ఈ సినిమాకు భారీగానే బడ్జెట్ పెడుతున్నారు ఈ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.ప్రెజెంట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో కేవలం ఒక్క సాంగ్ కోసం 7 భారీ సెట్స్ వేసినట్టు టాక్.

ఒక్క సాంగ్ కే ఈ రేంజ్ లో ఖర్చు చేయడం ఆసక్తికరంగా మారింది.టాక్ మంచిగా వస్తేనే ఇది సాధ్యం.

ఏ మాత్రం అటుఇటుగా వచ్చిన సినిమా బోల్తా కొట్టడం ఖాయం.మరి చైతూ ఇంత బడ్జెట్ ను వెనక్కి తీసుకు వస్తాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube