ఇండస్ట్రీ పరువు తీసిన సినిమాలు ఇవే !

ప్రస్తుతం తెలుగు.సినీఇండస్ట్రీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది.

 These Are The Films That Took The Reputation Of The Industry!, Balakrishna, Ramc-TeluguStop.com

తెలుగు ఇండస్ట్రీ నుంచి మూవీ వస్తోందంటే యావత్ ఇండియా మొత్తం క్యూరియాసిటీ తో ఎదురు చూస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.తెలుగు సినిమాలోని ఎమోషన్స్, సాంగ్స్, ఫైట్స్, డ్రామా, కామిడీ.

అబ్బో ఇలా ఒక్కటేంటి ఎన్నో అంశాలు సినీ ప్రియులను కట్టిపడేస్తున్నాయి.దాంతో ప్రస్తుతం బాలీవుడ్ ను సైతం మించిపోయేలా తెలుగు ఇండస్ట్రీ పేరు మారుమ్రోగుతోంది.

అయితే ఒకప్పుడు వచ్చిన తెలుగు సినిమాలు రియాలిటికి చాలా దూరంగా ఉండేవి.ఊహలకు అందని విధంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ బొక్క బోర్లా పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా ఓల్డ్ మూవీస్ లోని ఫైట్ సీన్స్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురైవుతూనే ఉన్నాయి.అలా ఇండస్ట్రీ పరువు తీసిన కొన్ని సినిమాలు వాటిలోని ఫైట్ సీన్లు గురించి తెలుసుకుందాం.

1.పల్నాటి బ్రహ్మనాయుడు

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన చాలా సినిమాలలోని ఫైట్స్ సీన్స్ ఇప్పటికీ కూడా ట్రోలింగ్ కు గురౌతూనే ఉన్నాయి.

బాలయ్య యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మానందరికి తెలిసిందే.అయితే బాలయ్యను నెక్స్ట్ లెవెల్ యక్షన్స్ సీన్స్ లో చూపించాలని డైరెక్టర్ చేసిన అతి ప్రయత్నానికి నిదర్శనమే ఈ సినిమా.

బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలోని ఫైట్స్ ప్రేక్షకులకు కళ్ళు బైర్లు కమ్మెలా చేస్తాయి.తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, హీరో చిటికెసి పిలిస్తే కుర్చీ తో సహ విలన్ హీరో కళ్ల వద్దకు రావడం.అబ్బో ఇలా చాలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలోని యాక్షన్ అతిసన్నివేశాలకు కొరతే ఉండదు.

Telugu Balakrishna, Flop, Ramcharan, Shakthi, Vijaendravarma, Vinayavidheya-Movi

2.విజయేంద్ర వర్మ

నటసింహా నందమూరి నటించిన ఈ మూవీ కూడా సినీ ప్రేక్షకుల ఐక్యూ కు గట్టిగానే పరీక్ష పెడుతుంది.స్వర్ణ సుబ్బరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ఫైట్స్ సీన్స్ చూస్తే అలా ఎలా జరిగింది అనే ఆశ్చర్యం కలుగక మానదు.ట్రైన్ కు హీరో అడ్డంగా దాటడం, కొండపై నుంచి హీరో జంప్ చేయడం ఇలా చాలా సన్నివేశాలు తలనొప్పి తెప్పిస్తాయి.

Telugu Balakrishna, Flop, Ramcharan, Shakthi, Vijaendravarma, Vinayavidheya-Movi

​3.వినయ విధేయ రామ

రాంచరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ఫైట్ సీన్స్ కూడా లాజిక్స్ కు అందని రీతిలో ఉంటాయి.హీరో ట్రైన్ పై నిలబడి బిహార్ వరకు వెళ్ళడం, విలన్స్ ను నరికితే తలలను గద్దలు ఎత్తికెళ్లడం, విలన్ ను కాటేసిన పాము చనిపోవడం.ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో ఓవర్ సన్నివేశాలకు కొదువే ఉండదు.

Telugu Balakrishna, Flop, Ramcharan, Shakthi, Vijaendravarma, Vinayavidheya-Movi

4.శక్తి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల సహనానికి పెద్ద పరిక్షే పెడుతుంది.రొటీన్ స్టోరీకి కాస్త ఫాంటసీ టచ్ తో వచ్చిన ఈ మూవీలోని ఫైట్ సీన్స్ కూడా కాస్త ఓవర్ గానే ఉంటాయని చెప్పాలి.ముఖ్యంగా విలన్ ను కారు గుద్దితే కారే నుజ్జు నుజ్జు అయిపోవడం, మితిమీరిన హీరో ఎలివేషన్స్ , తండ్రి పాత్రలోని ఎన్టీఆర్ గెటప్ ఇలా చాలా వాటిపైనే ట్రోల్స్ వచ్చాయి.

ఇంకా పవన్ కల్యాణ్ నటించిన బంగారం, మహేశ్ బాబు నటించిన సైనికుడు, అల్లు అర్జున్ నటించిన వరుడు.ఇలా ఆయా హీరోలు నటించిన చాలా సినిమాలలోని ఫైట్స్ లాజిక్స్ కు ఏమాత్రం అందవు.

అయితే ఈ సినిమాలన్నీ వారివారి కెరియర్ లో బెగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలవడం గమనార్హం.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube