నాని హీరో గా గతంలో రూపొంది వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.ఆ సినిమా సమయం లోనే విజయ్ దేవరకొండ కి మంచి పేరు వచ్చింది.
ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత విజయ్ దేవరకొండకు పలు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి.అంతే కాకుండా అర్జున్ రెడ్డి మరియు గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కూడా దక్కాయి.
ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ మరో సారి నాచురల్ స్టార్ నాని తో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని ప్రచారం జరుగుతుంది.చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయట.
ఇంతకు ముందు నాని సినిమా లో విజయ్ దేవరకొండ కీలక పాత్ర లో కనిపించాడు.కానీ త్వరలో రాబోతున్న సినిమా లో మాత్రం ఇద్దరికి సమానమైన పాత్ర లభించబోతున్నట్లుగా తెలుస్తోంది.
నాని మరియు విజయ్ దేవరకొండ లకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.అందుకే కలిసిన నటిస్తే ఖచ్చితం గా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం అందుకు సంబంధించిన కథ రెడీ అవుతుంది అనే ప్రచారం జరుగుతుంది.నాని మరియు విజయ్ దేవరకొండ యొక్క ఇమేజ్ కి తగ్గట్లుగా కథ ను రూపొందించాలని మల్టీ స్టారర్ కనుక కాస్త ఎక్కువగా దృష్టి పెట్టాలని దర్శకుడు భావిస్తున్నాడట.ఇంతకు ఆ దర్శకుడు ఎవరు.ఈ మల్టీ స్టార్ సినిమా ని నిర్మించబోతున్నది ఎవరు అనే విషయాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి ఈ చిన్న వార్త అభిమానులకు ఫుల్ ఖుషి కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.







