ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.కాకినాడ జిల్లా గుమ్మలదొడ్డిలో నిర్వహించిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.మహిళా శక్తిని జగన్ తక్కువగా అంచనా వేస్తున్నారన్నారు.
సీఎం వలన రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు.ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.







