తెలంగాణలో హంగ్ రాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎవరితో పొత్తు ఉండదని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ తో ఎవరూ పొత్తు పెట్టుకోరని మంత్రి తలసాని పేర్కొన్నారు.జాతీయ రాజకీయాల్లో పొత్తులపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పూర్తి మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ప్రతిపక్షాలు గాలిమాటలు మాట్లాడటం సరికాదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.







