నందమూరి కళ్యాణ్ రామ్ చాలా సంవత్సరాల తర్వాత బింబిసారా అనే సినిమా తో సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆ సినిమా ఏకంగా బాక్సాఫీస్ వద్ద డెబ్బై కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేయడం తో నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లో అత్యధిక వసూలు సొంతం చేసుకున్న సినిమా గా బింబిసారా నిలిచింది.
ఆ సమయం లోనే నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమా కు సీక్వెల్ రాబోతుందన్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.అంతే కాకుండా సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నాడు.
ఇటీవల అమిగోస్ అనే సినిమా తో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని కళ్యాణ్ రామ్ ఆశించాడు.
అమిగోస్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.బింబిసార సినిమా యొక్క సక్సెస్ ను కంటిన్యూ చేసే విధంగా అమిగోస్ ఉంటుందని చాలా మంది ఆశించారు, కానీ ఆ సినిమా నిరాశ పర్చడం తో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం చేస్తున్న డెవిల్ మరియు ఆయన ఇప్పటికే చేస్తానని ప్రకటించిన బింబిసారా యొక్క సీక్వెల్ గురించి అంత ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

డెవిల్ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అయితే బింబిసారా సినిమా ఎప్పుడు ఉంటుంది, అసలు ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వశిష్ట్ దర్శకత్వం లో వచ్చిన బింబిసారా సినిమా యొక్క సీక్వెల్ కి దర్శకుడు ఎవరు అనే కొత్త చర్చ మొదలైంది.వశిష్ఠ్ దర్శకత్వం లోనే సీక్వెలు ఉంటుందా అంటే అనుమానమే అంటే చాలా మంది నందమూరి కళ్యాణ్ రామ్ కి సన్నిహితంగా ఉండే వారు మాట్లాడుతున్నారు.
కథ విషయం లో నందమూరి కళ్యాణ్ రామ్ కి మరియు వశిష్ట్ కి భేదాభిప్రాయాలు వచ్చాయట, అందుకే కొత్త దర్శకుడుని తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది.ఈ సంవత్సరం చివర్లోనే సీక్వెల్ యొక్క చిత్రీకరణ ప్రారంభిస్తామంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రకటించిన విషయం తెలిసింది.







