గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన ఆరు బోగాలు పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే.ఆయిల్ లీక్ అవ్వడం వలనే పట్టాలు తప్పినట్లు గుర్తించారు.
ఆ సమయంలో వంద కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
దీనిపై ఇప్పటికే రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కాగా, విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా గోదావరి ఎక్స్ ప్రెస్ లోని చివరి ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.
అయితే సాంకేతిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కకుండా సహాయపడింది.దీంతో పెను ప్రమాదం తప్పింది.







