ఈ ప్రపంచంలో పురాతన కాలం నాటి వస్తువులకు ఉండే డిమాండ్ వేరే స్థాయిలో ఉంటుంది.అందుకే వాటిని చూసేందుకు చాలామంది మ్యూజియంకు వెళ్తుంటారు.
వాటి ప్రత్యేకతలను బట్టి బాగా డబ్బున్నవారు వాటిని సొంతం చేసుకుంటారు.దాంతో వాటి విలువ కూడా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ఆయా వస్తువులను వేలం వేసినప్పుడు భారీ మొత్తం చెల్లించి మరీ కొనుగోలు చేస్తుంటారు.అలా వేలంలో ఓ పాతకాలపు మోటర్ బైక్ ఏకంగా కోట్ల ధర పలికి అందరికీ అవాక్కయేలా చేసింది.

అవును, ఓ పాతకాలపు మోటారు బైక్ తాజాగా జరిగిన వేలంలో ఎంత ధర పలికిందంటే… అక్షరాలా 9,35,000 అమెరికా డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.7.72కోట్లు పలికింది.ఇలా ఆ బైక్ ఏదనేగా మీ అనుమానం.
అదే స్ట్రాప్ ట్యాంక్ హార్లీ డేవిడ్‌సన్ బైక్. పాతకాలం మోటారు బైక్‌లు అమ్మే వింటజంట్ వెబ్‌సైట్ గతనెలలో దీన్ని వేలానికి పెట్టగా ఓ ఔత్సాహికుడు దాన్ని సొంతం చేసుకున్నట్టు సమాచారం.

ప్రముఖ అమెరికా బైక్ కంపెనీ హార్లీడేవిడ్‌సన్ ఈ బైక్‌ని 1908లో తయారు చేసింది.ఆయిల్, ఇంధన ట్యాంకు నికెల్‌తో చేయబడింది.అందుకే దీనికి స్ట్రాప్ ట్యాంక్ హార్లీ డేవిడ్‌సన్ అనే పేరు పెట్టారు.ఇకపోతే ఈ కంపెనీ నుండి తాజాగా భారత విపణిలోకి స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ రిలీజ్ అయింది.
ఇండియాలో హీరోమోటో కార్ప్స్‌తో కలిసి ఆవిష్కరించిన రెండో బైక్ ఇది కావడం విశేషం.హార్లీ ఓర్జిన్స్‌ను న్యూ స్పోర్ట్‌స్టర్ ఎస్ పోలి ఉంటుంది.
ఇది భారత్‌లోని ఎఫ్‌టీఆర్ బైక్‌తో గట్టిగా తలపడనున్నది.కాగా దీని ధర ఇక్కడ రూ.15.5 లక్షల రూపాయిలు.