సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్, అంటే డ్రైవింగ్ అవసరంలేని వెహికల్ ను తాజాగా అమెజాన్ కు చెందిన Zoox విజయవంతంగా టెస్ట్ చేసింది.ఉద్యోగులే ప్యాసింజర్లుగా మారి ఈ రోబోట్యాక్సీని పబ్లిక్ రహదారులపై టెస్ట్ చేసారు.
కాలిఫోర్నియాలోని ఫారెస్ట్ సిటీలోని కార్యాలయం వద్ద ఈ సెల్ఫ్ డ్రైవింగ్ రోబో ట్యాక్సీని జూక్స్ టెస్ట్ చేసిందని సమాచారం.ఓ భవనం నుంచి మరో భవనం వరకు అంటే రహదారిపై ఓ కిలోమీటర్ వరకు ఈ రోబోట్యాక్సీపై ఉద్యోగులు ప్రయాణించారు.
ఈ విషయాన్ని దిగ్గజ సంస్థ అమెజాన్‍కు చెందిన జూక్స్ అధికారికంగా ప్రకటించింది.

ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.మనుషులు కంట్రోల్ చేసే అవసరం లేకుండా ఆటోమేటిక్‍గా నడిచేలా ఈ వాహనాన్ని జూక్స్ చాలా అద్భుతంగా డిజైన్ చేసిందని నివేదికలు చెబుతున్నాయి.2020 సెప్టెంబర్‌లో ఈ డ్రైవర్‌లెస్ కారు టెస్టింగ్‍కు అనుమతులు లభించగా నేటికి దాదాపుగా అవి పూర్తయినట్టు సమాచారం.ఈ ఫుల్లీ అటానమస్ వాహనానికి స్టీరింగ్, పెడల్స్ లాంటివి ఉండవు.ఆటోమేటిక్ ఈ వాహనమే కంట్రోల్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తుంది.ఈ కారులో మొత్తంగా నలుగురు ప్యాసింజర్లు వరకు కూర్చొవచ్చు.అంటే రెండువైపులా ఇద్దరు ప్రయాణికులు ఎదురెదురుగా కూర్చోవచ్చు.

ఈ కార్ గంటకు 56 కిలోమీటర్ల మేర గరిష్ట వేగంతో ప్రయాణించగదు.కమర్షియల్‍గా ఈ రోబో ట్యాక్సీ సర్వీస్‍ను ఎప్పుడు ప్రారభించనున్నది అనేది ఇంకా జూక్స్ స్పష్టంగా వెల్లడించలేదు.ఇందుకోసం అక్కడి ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఇంకా కొన్ని అనుమతులు పొందాల్సి ఉంది.పబ్లిక్‍కు ఈ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు అదనపు అనుమతులు అనేవి అవసరం అవుతాయి.
మరోవైపు, ప్రముఖ సంస్థలు ఫోర్డ్, ఫోక్స్‌వ్యాగన్ ఏఐ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను రూపకల్పనను కాస్త ఆలస్యం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.డ్రైవర్ అసిస్టెంట్ టెక్నాలజీపైనే ప్రస్తుతం ఆ కంపెనీలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి.







