తెలుగు సినీ కార్మికుల వేతనాలు పెంపుపై సందిగ్ధత కొనసాగుతోంది.ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ చర్చలు జరుపుతుంది.
పది మంది ఫెడరేషన్, పది మంది ఫిల్మ్ ఛాంబర్ సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.కాగా ఈ సమావేశంలో ప్రధానంగా చిన్న సినిమా, పెద్ద సినిమా ప్రాధాన్యతగా వేతనాల పెంపుపై ప్రత్యేక కమిటీ చర్చిస్తుంది.
అయితే ఫైటర్ల వేతనాలపై ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య ఒప్పందం కుదరలేదని తెలుస్తోంది.