రోజురోజుకూ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది.టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకు ఎన్నో ప్రయోజనాలు అందుతున్నాయి.
ముఖ్యంగా రోజులో మన జీవన విధానం మరింత సౌకర్యంగా మారుతోంది.మరో వైపు నేరాలు కూడా పెరుగుతున్నాయి.
ముఖ్యంగా దొంగతనాలు జరిగినప్పుడు బాధితులు విలువైన వాటిని పోగొట్టుకుని చింతిస్తుంటారు.ఇదే తరహాలో ఇటీవల అమెరికాలోని ఓ జంట తమ కొత్త కారును పోగొట్టుకుంది.
ఆశ్చర్యకర రీతిలో ఆ కారును వారు తిరిగి పొందారు.యాపిల్ ఎయిర్ ట్యాగ్ సాయంతో పోయిన కారును చాలా సులువుగా కనుగొన్నారు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

యాపిల్ సంస్థకు చెందిన ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది.వీటిలో ఉండే భద్రతా ఫీచర్ల కారణంగా చాలా మంది వీటిని ఇష్టపడుతుంటారు.ఆపిల్ యొక్క ట్రాకింగ్ అప్లికేషన్ ‘ఫైండ్ మై’ సహాయంతో, అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్న ఓ జంట పోయిన తమ కారును కనుగొన్నారు.ఈ కేసులు దొంగతనం చేసిన వారు కూడా అరెస్ట్ అయ్యారు.
బాధితుల కారును దొంగలు ఎత్తుకుపోయారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కారు లోపల వాటి యజమానులు ఎయిర్‌పాడ్ ను ఉంచారు.
దీంతో యజమానులు ఆపిల్ ఫోన్ యొక్క ‘ఫైండ్ మై’ అప్లికేషన్ నుండి ఎయిర్‌పాడ్ ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు.ఫలితంగా పోలీసులు, ఆ వాహన యజమానులు ఆ కారు ఉన్న చోటికి వెళ్లారు.
ఆ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.యాపిల్ ఫోన్ ఫైండ్ మై అప్లికేషన్ సాయంతో ఇలా పోయిన వాటిని యజమానులు దక్కించుకోవచ్చు.
దీంతో ఈ ఫోన్ ఉత్పత్తుల వల్ల ఇలాంటి ప్రయోజనాలు కూడా పొందొచ్చు.అయితే దురదృష్టవశాత్తూ కొందరు వీటిని దుర్వినియోగం చేస్తున్నారు.







