టాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్ కు దూరంగా ఉంటున్న మల్లూ స్టార్‌ హీరో

మహానటి మరియు సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన దుల్కర్ సల్మాన్‌ ను తెలుగు లో మరిన్ని సినిమాల్లో నటింపజేయాలని భావిస్తున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 Malayalam Star Hero Dulqure Salman Dont Want To Do Telugu Films , Dulqure Salman-TeluguStop.com

తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ చాలా మంది దుల్కర్ సల్మాన్ తో సినిమాలకు ప్లాన్ చేస్తున్నారు.

Telugu Dulqure Salman, Mahanati, Seetharam, Telugu-Movie

కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్‌ కి కూడా ఆయన నుండి గ్రీన్ సిగ్నల్‌ రావడం లేదు.అదుగో ఇదుగో అంటూ కనీసం కథలు కూడా వినకుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడట.ఆ మధ్య ఒక ప్రముఖ నిర్మాత వెళ్లి కథను చెప్పించేందుకు ప్రయత్నించాడట.

అయినా కూడా దుల్కర్ సల్మాన్‌ నుండి గ్రీన్ సిగ్నల్‌ రాలేదు.అంతే కాకుండా ప్రస్తుతానికి తెలుగు సినిమాలు చేసే ఆసక్తి లేదు అన్నట్లుగా తేల్చి చెప్పాడట.

Telugu Dulqure Salman, Mahanati, Seetharam, Telugu-Movie

పాన్‌ ఇండియా సినిమా చేసేందుకు ప్రముఖ దర్శకుడు దుల్కర్ సల్మాన్ కోసం కథ సిద్దం చేయడం జరిగిందట.కానీ ఇప్పటి వరకు కూడా ఆ దర్శకుడికి కథ చెప్పేందుకు సమయం ఇవ్వడం లేదట.దాంతో ఆ కథను మరో హీరోతో చేయాలని నిర్ణయించుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Dulqure Salman, Mahanati, Seetharam, Telugu-Movie

మొత్తానికి తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ కు దుల్కర్ సల్మాన్‌ ఓకే చెప్పక పోవడానికి కారణం ఏంటో అని మాత్రం క్లారిటీ రావడం లేదు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మహానటి మరియు సీతారామం సినిమా లు చేసిన దుల్కర్ సల్మాన్‌ ను తెలుగు ప్రేక్షకులు మరిన్ని సినిమా ల్లో చూడాలని ఆశ పడుతున్నారు.కానీ ఇప్పటి వరకు దుల్కర్ మాత్రం తెలుగు సినిమా లకు ఓకే చెబుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

ముందు ముందు అయినా తెలుగు సినిమా లు చేసేందుకు దుల్కర్ ఓకే చెప్తాడా అనేది చూడాలి.ప్రస్తుతానికి దుల్కర్ మలయాళ సినిమా ల్లో మాత్రమే నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube