టి.కాంగ్రెస్ లో మళ్లీ అదే తంతు ! రేవంత్ కు సహకారం అంతంతే ? 

తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్టుగా మారింది.పార్టీ ఇన్చార్జీలు , అధిష్టానం దూతలు ఎంతమంది వచ్చినా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య సయోధ్య కుదర్చలేకపోతున్నారు.

 Tpcc Chief Revanth Reddy Troubled By Tcongress Senior Leaders Details, Telangana-TeluguStop.com

గ్రూపు రాజకీయాలు లేకుండా చేయడంలో విఫలం అవుతూనే ఉన్నారు.ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మధ్య  వివాదాలు తరచుగా  తలెత్తుతూనే ఉన్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆయనకు సీనియర్ నాయకులు నుంచి సహకారం అంతంత మాత్రంగానే లభిస్తుంది.ప్రస్తుతం హాథ్ సే హాథ్ జొడో యాత్రను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టారు.

దీనికి సీనియర్ నాయకులు నుంచి సహకారం అంతంత మాత్రమే లభిస్తుంది.ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బిజీగా ఉన్న నాయకులంతా ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న రేవంత్ పాదయాత్రకు మద్దతు ఇస్తారా లేదా అనేది సందేహంగా మారింది.

Telugu Aicc, India Congress, Congress Senior, Haathse, Manikrao Takre, Revanthre

గాంధీభవన్ వర్గాలు కూడా రేవంత్ పాదయాత్రలో సీనియర్ల భాగస్వామ్యంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో , ఈ ఉత్కంఠ నెలకొంది.ఈనెల 14వ తేదీన భద్రాచలంలో జరిగే రేవంత్ యాత్రలో మల్లు బట్టు విక్రమార్క పాల్గొంటారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మళ్లీ రవి చెప్పారు.మిగతా సీనియర్ల విషయంలో ఆయన ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.దీంతో రేవంత్ పాదయాత్రకు సీనియర్లు దూరంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సహకారంతో రేవంత్ పాదయాత్ర ముందుకు తీసుకెళుతున్నారు.

Telugu Aicc, India Congress, Congress Senior, Haathse, Manikrao Takre, Revanthre

తన వర్గం నాయకులతోనే ఆయన యాత్ర చేస్తున్నారు.రేవంత్ పర్యటిస్తున్న నియోజకవర్గాల్లో కొంతమంది సీనియర్ నాయకులు ఆ యాత్రలో పాల్గొనకపోవడాన్ని టీపీసీసీ కూడా గుర్తించింది.రేవంత్ పాదయాత్ర షెడ్యూల్ మొత్తం 60 రోజులు కావడం తో సహకరించిన వారు ఎవరు ? సహకరించని నాయకులు ఎవరు అనేది గుర్తించే పనిలో రేవంత్ వర్గం ఉంది.రేవంత్ పాదయాత్రకు అంతా హాజరుకావాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు సూచించినా సీనియర్లు మాత్రం దూరంగానే ఉంటున్నారు.నేడు ఈ విషయంలో మరింత క్లారిటీ రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube