భారతదేశంలో మిర్చి అధికంగా పండించే ప్రాంతాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్లేస్‌లో ఉంటుందని అనడంలో సందేహం లేదు.అయితే నల్లతామర పురుగు వల్ల గతేడాది మిర్చి పంట వేసిన రైతులు చాలా నష్టపోయారు.
పంటల భీమాలో మిర్చి ఉండకపోవడం వల్ల వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.ఇలాంటి నష్టాలను నివారించేందుకు నల్లతామర నుంచి పంటను కాపాడడానికి రైతులు రకరకాల మందులు వాడుతున్నారు.
అయినా కూడా ఫలితం లభించడం లేదు.

అయితే చివరికి వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడి గ్రామానికి చెందిన రైతు నాగమల్లేశ్వరరావు ఒక అద్భుతమైన పరిష్కారం కనుగొన్నాడు.అతడు సోలార్ లైట్లను ఉచ్చుగా ఉపయోగిస్తూ నల్లతామరతో సహా అన్ని పురుగులు, దోమలను పంటను నాశనం చేయకుండా కాపాడుతున్నారు.అతని ఆవిష్కరణలో ఒక ప్లాస్టిక్ తొట్టిని బేస్ చేసుకుని సోలార్ లైటు నిటారుగా ఉంటుంది.
అంతేకాదు, దాని మీద ఒక చిన్న సోలార్ ప్యానల్ కూడా ఉంటుంది.సూర్యరష్మి ఉన్న డే టైమ్‌లో సోలార్ ప్యానల్స్ ద్వారా ఈ లైట్ ఛార్జ్ అవుతుంది.
తరువాత రాత్రి 6గంటలు కాగానే లైట్లు ఆటోమెటిగ్గా ఆన్ అవుతాయి.

ఈ లైట్ వెలిగినప్పుడు కాంతికి అట్రాక్ట్ అయ్యే పురుగులు లైటు వద్దకు వస్తాయి.ఆ క్రమంలోనే అవి లైట్ వేడికి తొట్టెలో పడిపోతాయి.ఈ ప్లాస్టిక్ తొట్టెలో సర్ఫు నీళ్లు పోస్తారు.
అప్పుడు అందులో పడిపోయిన పురుగులు ఎగరలేక చివరికి అందులోనే సమాధి అవుతాయి.నాగమల్లేశ్వరరావు రైతు ప్రకారం ఒక్క ఎకరానికి 3 – 4 లైట్లు ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుంది.
కాగా 40 ఎకరాలు కౌలుకు తీసుకున్న నాగమల్లేశ్వరరావు మిర్చి అధిక దిగుబడి కోసం 200 సోలార్ లైట్లను ఏర్పాటు చేశాడు.అయితే సర్ఫ్ నీళ్లను రెండు రోజులకు ఒకసారి తాను మారుస్తానని తెలిపాడు.ఈ రైతు ప్రకారం ఒక్కో ఎకరాకు 3 లైట్ల ఏర్పాటుకు రూ.4,500 ఖర్చవుతుంది.అంటే ఆధారంగా వాడే పురుగుల మందుల కంటే దీని తర్వాత చాలా తక్కువే.అలాగే దీనివల్ల దిగుబడి పెరుగుతుంది.







