ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను... ప్రణీత కామెంట్స్ వైరల్!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రణీత తెలుగులోకి ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు.ఇలా ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.

 Actress Pranitha Subhash About Her Troubles During Pregnancy Details, Praneetha-TeluguStop.com

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా ద్వారా ఈమెకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.అయితే ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ఈమె తన స్నేహితుడు ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.

Telugu Actresspranitha, Nitin Raj, Praneetha, Pranithasubhash-Movie

ఇలా వివాహమైన కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ అయినటువంటి ప్రణీత గత ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా తరుచు తన ఫోటోలతో పాటు తన కూతురు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.ఇక తన కుమార్తె కాస్త పెద్దగా కావడంతో ఈమె తిరిగి సినిమాలలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే వరుస ఫోటోషూట్లు చేసి అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

Telugu Actresspranitha, Nitin Raj, Praneetha, Pranithasubhash-Movie

ఈ క్రమంలోనే తాను ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్నటువంటి కాస్త ఇబ్బందులు గురించి చెప్పుకొచ్చారు.ప్రెగ్నెన్సీ సమయంలో తాను చాలా శరీర బరువు పెరిగిపోయాయని తన ముక్కు బుగ్గలు బాగా ఉబ్బిపోయాయని తెలిపారు.తన చుట్టాలందరూ తనని చాలా క్యూట్ గా ఉన్నావని చెప్పేవారు.

అయితే తనకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేదని పాప పుట్టిన తర్వాత డైట్ తీసుకుంటూ వ్యాయామాలు చేస్తూ శరీర బరువు తగ్గానని తెలిపారు.అందుకే తన ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా ఫోటోలను షేర్ చేయలేదని ప్రణీత ఈ సందర్భంగా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube