నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రమాదం జరిగింది.నిత్యాన్నదానం వెనుక వైపు ఉన్న వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ మరోసారి పేలింది.
ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.బాధితులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.
బాయిలర్ పేలడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న ఆలయ అధికారులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
కాగా గతంలోనూ వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ పేలిన సంగతి తెలిసిందే.







