పవన్ కళ్యాణ్ సినిమాల రిలీజ్ ఆర్డర్ ఏంటో అర్థం కాక అభిమానులు గందరగోళానికి గురి అవుతున్నారు.ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ సగానికి పైగా పూర్తయింది.
ఆ సినిమా ను పూర్తి చేయకుండా పవన్ కళ్యాణ్ సాహో సుజీత్ దర్శకత్వం లో ఒక సినిమా ను మొదలు పెట్టాడు.ఆ సినిమా కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇక మరో సూపర్ హిట్ మూవీ వినోదయ్య సిత్తం రీమేక్ కోసం ఏర్పాటు జరుగుతున్నాయి.ఫిబ్రవరి 14న ఆ రీమేక్ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంటూ చిత్ర అధికారికంగా ప్రకటించారు.
సాహో సుజిత్ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా మరియు వినోదయ్య సిత్తం సినిమా లు కేవలం రెండు మూడు నెలల వ్యవధిలోని షూటింగ్ పూర్తి చేయబోతున్నారట.

రెండు సినిమా లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కంటే ముందు ఈ రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ రెండు సినిమా లు ముందు విడుదలయితే హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు.

ఈ మూడు సినిమా లతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ను ప్రకటించాడు.ఆ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు అనే విషయమై క్లారిటీ లేదు.మొత్తానికి నాలుగు సినిమా లతో పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు బాక్సాఫీస్ వద్ద దండ యాత్ర మొదలు పెడతాడా అంటూ అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.







