కాంగ్రెస్, బీజేపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.కేసీఆర్ అభివృద్ధి చేస్తుంటే విపక్ష నేతలు టెర్రరిస్టుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీజేపీ నేతలు కట్టడాలను కూలిస్తే ప్రజలు ఆ పార్టీని పాతరేస్తారని జీవన్ రెడ్డి తెలిపారు.రేవంత్ రెడ్డి, బండి సంజయ్ టెర్రరిస్ట్ భాషను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ను అహింస నుంచి హింసా వాదానికి రేవంత్ తీసుకొచ్చారని ఆరోపించారు.ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఉండాల్సిన వాళ్లు పార్టీ అధ్యక్షులు అయ్యారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు చేసేవి పాదయాత్రలు కాదన్న ఆయన అంతిమ యాత్రలు విమర్శలు గుప్పించారు.







