ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందించిన ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్!

ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ ఈ మధ్యకాలంలో వరుస వివాదాలలో నిలుస్తున్నారు.గత కొద్ది రోజుల క్రితం పఠాన్ సినిమా బ్యాన్ చేయాలన్న వారిపై తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 The Kashmir Files Director Vivek Agnihotri Strong Counter To Prakash Raj Comment-TeluguStop.com

అలాగే ఓ మీడియా సమావేశంలో భాగంగా ఈయన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా ఈ సినిమా గురించి మాట్లాడుతూ గత ఏడాది వచ్చిన అత్యంత చెత్త సినిమాలలో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఒకటి అని తెలిపారు.

ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా ఈ సినిమాపై ఉమ్మేసింది.

ఇలాంటి చెత్త సినిమాలు కోసం దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారు.ఇలాంటి సినిమా చేయడమే కాకుండా ఈ సినిమాకు ఆస్కార్ నామినేషన్ రాలేదని డైరెక్టర్ అడుగుతున్నారు.ఈ సినిమాకు ఆయనకు ఆస్కార్ కాదు కదా భాస్కర్ అవార్డు కూడా రాదంటూ ప్రకాష్ రాజ్ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా ఈ సినిమా గురించి ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించి తనదైన శైలిలో నటుడు ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే వివేక అగ్నిహోత్రి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.జనాలు ఎంతగానో ఆదరించిన ఈ సినిమా అర్బన్ నక్సల్స్ కు నిద్ర లేకుండా చేసింది.అలాంటి సినిమాను చూసిన జనాలను కుక్కలంటూ సినిమా విడుదలైన ఏడాదికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.

మిస్టర్ అంధకార్ రాజ్.భాస్కర్ అవార్డు ఎప్పటికీ మీదే అయినప్పుడు ఆ అవార్డును నేనెలా పొందగలను అంటూ వివేక్ అగ్నిహోత్రి ప్రకాష్ రాజుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube