వారికోసం ఒక్క పది నిమిషాలు కేటాయించండి... హితబోధ చేస్తున్న నయనతార!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార ప్రస్తుతం కొత్త జీవితంలోకి అడుగుపెట్టి అమ్మగా కూడా ప్రమోట్ అయ్యారు.ఇలా తల్లిగా మారినప్పటికీ వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు.

 Allocate Ten Minutes For Them Nayantara Giving Advice , Nayantara , College Stud-TeluguStop.com

అయితే తాజాగా నయనతార నటించిన కనెక్ట్ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు ప్రస్తుతం ఈమె అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నటిస్తున్నారు.ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించిన విశేషం.

ఇలా తన సినిమాలతో బిజీగా ఉన్నటువంటి నయనతార తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు హితబోధ చేశారు.

Telugu Allocateminutes, Connect, Jawan, Nayantara, Tollywood-Movie

ఈ సందర్భంగా ఈమె కాలేజీ విద్యార్థులను ఉద్దేశిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను మాట్లాడారు.విద్యార్థులకు కాలేజీ లైఫ్ ఎంతో కీలకమైనదని ఎంతో సంతోషకరమైనదని తెలిపారు.ఈ దశలో విద్యార్థులు తీసుకునే నిర్ణయం పై వారి జీవితం ఆధారపడి ఉంటుందని నయనతార తెలియజేశారు.

మంచి స్నేహం చేస్తే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని అదే చెడు సావాసం అయితే జీవితం మరోలా ఉంటుందని ఈమె విద్యార్థులకు హెచ్చరించారు.చదువు పూర్తి కాగానే ఎంతో విలువలతో కూడిన జీవితాన్ని కొనసాగించినప్పుడే లైఫ్ చాలా ఆనందంగా ఉంటుందని తెలిపారు.

Telugu Allocateminutes, Connect, Jawan, Nayantara, Tollywood-Movie

ఇలా మన జీవితంలో మనం ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో రోజుకు కనీసం 10 నిమిషాలు సమయం కేటాయించి వారితో మాట్లాడటం ఎంతో అవసరం అని విద్యార్థులకు సూచించారు.ఇలా పది నిమిషాలు నవ్వుతూ వారితో మాట్లాడితే వారు కూడా చాలా సంతోషంగా ఉంటారని వారి ఆశీస్సులు కూడా ఎల్లవేళలా మీపై ఉంటాయంటూ ఈమె తల్లిదండ్రుల గురించి విద్యార్థులకు మంచి విషయాలను తెలియజేశారు.ఇలా నయనతార విద్యార్థులను ఉద్దేశించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube