అమిగోస్ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. వాళ్లకు మాత్రం సినిమా నచ్చదంటూ?

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమిగోస్ మూవీ థియేటర్లలో విడుదలైంది.కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది.

 Amigos Movie Plus And Minus Points Details Here Goes Viral In Social Media , As-TeluguStop.com

క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతున్నా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అవుతోంది.ఫస్టాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ బాగుండటం గమనార్హం.

సరికొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.

సినిమా స్టార్టింగ్ సన్నివేశాలు పెద్దగా ఆసక్తికరంగా లేవు.

దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఈ సినిమాను మరింత అద్భుతంగా తెరకెక్కించే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఈ సినిమా యావరేజ్ గా నిలుస్తుంది.

కళ్యాణ్ రామ్ మాత్రం మూడు పాత్రలకు తాను పూర్తి స్థాయిలో న్యాయం చేశారనే చెప్పాలి.విజువల్ ఎఫెక్స్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.

Telugu Amigos, Amigos Result, Brahmaji, Rajendra Reddy, Kalyan Ram-Movie

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కళ్యాణ్ రామ్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.ఆషికా రంగనాథ్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.బ్రహ్మాజీ ఉన్న సన్నివేశాలు ఆసక్తికరంగా లేకపోవడం ఒకింత మైనస్ అయింది.కొన్ని సన్నివేశాలు ఊహలకు అనుగుణంగా ఉండటం గమనార్హం.దర్శకుడు రాజేంద్ర రెడ్డి మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Telugu Amigos, Amigos Result, Brahmaji, Rajendra Reddy, Kalyan Ram-Movie

బింబిసార సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.మరీ భారీ అంచనాలతో ఈ సినిమాకు వెళితే మాత్రం నిరాశ తప్పదని చెప్పవచ్చు.అమిగోస్ మూవీ రిజల్ట్ కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది.

కథల ఎంపికతో పాటు దర్శకుల ఎంపికలో కళ్యాణ్ రామ్ జాగ్రత్త వహించాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube