రాబోయే ఐదేళ్లలో భారతీయులు ఎక్కువగా ఏ గల్ఫ్ దేశానికి వలస వెళ్తారో తెలుసా?

మన భారతీయులు ప్రపంచంలో ఎక్కడన్నా బతికేస్తారు.అందుకే మీరు ఈ ప్రపంచంలో ఏ దేశమన్నా వెళ్లి చూడండి.

 Do You Know Which Gulf Country Most Indians Will Migrate To In The Next Five Yea-TeluguStop.com

అక్కడ ఖచ్చితంగా మన భారతీయులు తారసపడతారు.ఈ క్రమంలోనే మనవాళ్ళు ఉపాధి అవకాశాలు కోసం అత్యధికంగా సౌదీ అరేబియా వెళుతూ వుంటారు.ఐదేళ్ల క్రితం అత్యధిక శాతం భారతీయులు UAEలో ఉపాధి పొందగా గతేడాది ఆ స్థానాన్ని సౌదీ అరేబియా కైవసం చేసుకోవడం విశేషం.2022లో సౌదీలో 1,78,630 మంది భారతీయులకు ఉపాధి పొందినట్టు భోగట్టా.

Telugu Gulf, Indians, Latest, Saudi Arabia-Latest News - Telugu

అవును, సౌదీలో 2021లో సుమారు 32 వేల మంది భారతీయులు ఉద్యోగాలు పొందగా.ఆ మరుసటి ఏడాదే వీరి సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం.గతేడాది సౌదీ తరువాత కువైట్ లోనే అత్యధికంగా అంటే సుమారు 71 వేల మంది భారతీయులు ఉపాధి పొందినట్టు సమాచారం.ఇక 2021తో పోలిస్తే 2022లో అక్కడ భారతీయ కార్మికుల సంఖ్య ఏకంగా 7 రెట్లు పెరగడం విశేషం.ఇకపోతే 2018లో అత్యధికంగా 1.12 లక్షల మంది భారతీయులకు ఉపాధి అవకాశాలు దక్కిన కువైట్ లో గతేడాది కేవలం 33,233 మంది మాత్రమే ఉపాధి పొందగలిగారు.

Telugu Gulf, Indians, Latest, Saudi Arabia-Latest News - Telugu

ఇక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంటూ… భారత్ నుంచి వలసెళ్లిన వారిలో 50 శాతం గల్ఫ్ దేశాల్లోనే ఉపాధి పొందుతున్నారు అని ఓ సందర్భంగా లెక్కలు చెప్పారు.ఇక గల్ఫ్‌ దేశాల్లోని 70 శాతం మంది సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ వర్కర్సే ఉండడం కొసమెరుపు.వృత్తి నిపుణులు, వైట్ కాలర్ సిబ్బంది వాటా కేవలం 20 నుంచి 30 శాతం వరకూ ఉంటుంది.రానున్న సంవత్సరాల్లో సౌదీ అరేబియాలో భారతీయులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకావం ఉందని పరిశీలకులు తాజాగా గణాంకాలు చూసి చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube