ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సీబీఐ దూకుడు పెంచింది.ఇందులో భాగంగా ఇవాళ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేయనున్నారు.
కేసు వివరాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి సీబీఐ ఐదుసార్లు లేఖ రాసింది.
మొయినాబాద్ ఎఫ్ఐఆర్ కు సంబంధించిన పూర్తి వివరాలు, సంబంధిత పత్రాలు తమకు ఇవ్వాలని అధికారులు లేఖలో పేర్కొన్నారు.అయితే సీబీఐ లేఖపై ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు.
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ ను విచారించేందుకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఈనెల 17న విచారిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.







