కోటంరెడ్డి కి పెద్ద చిక్కే వచ్చిందే ? టీడీపీ కాదా బీఆర్ఎస్ నా ?

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు డైలామాలో పడింది.సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన బహిరంగంగా విమర్శలు చేసిన నేపథ్యంలో, వైసిపి కూడా ఆయనకు గట్టి కౌంటర్లు ఇస్తోంది.

 Ycp Rebel Mla Kotam Reddy Sridhar Reddy Facing Troubles To Join Which Party Brs-TeluguStop.com

శ్రీధర్ రెడ్డి టిడిపిలోకి వెళ్లేందుకే ఈ విమర్శలు చేస్తున్నారని వైసిపి ఎదురు దాడి చేయగా, దానికి తగ్గట్టుగానే శ్రీధర్ రెడ్డి కూడా తాను 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా నెల్లూరు రూరల్  రూరల్ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ప్రకటించారు.ఈ ప్రకటన పై టిడిపిలో బిన్నస్వరాలు వినిపించాయి.

ఇంకా పార్టీలో చేరకుండానే, పార్టీ అధినేత చంద్రబాబు ఏ ప్రకటన చేయకముందే శ్రీధర్ రెడ్డి తనకు టికెట్ ఎలా ప్రకటించుకుంటారు అంటూ టిడిపి సీనియర్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.

ఈ విధంగా సొంత ప్రకటనలు చేయడం సరికాదని ఆయన శ్రీధర్ రెడ్డికి హితవు పలికారు.ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని శ్రీధర్ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్న టిడిపి నాయకులంతా, ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ మార్గాలపైన శ్రీధర్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.టిడిపిలో తన చేరికకు ఇబ్బందులు ఏర్పడితే, ఏ పార్టీలో చేరాలనే విషయం పైన ఆయన చేస్తున్నారట.

Telugu Anamramnarayana, Ap, Chandrababu, Jagan, Janasena, Kotamreddy, Nellururur

ఇప్పటికే శ్రీధర్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు తోను, లోకేష్ తోను టచ్ లో ఉన్నారని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.టిడిపి క్యాడర్ మాత్రం శ్రీధర్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తోంది.ఈ క్రమంలోనే ఆయన ఇతర పార్టీ ల్లో ఏ పార్టీలో చేరితే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందనే విషం పై తన అనుచరులతో మంతనాలు చేస్తున్నారు.తాను టిడిపిలో చేరిన తన విజయానికి టిడిపి క్యాడర్ సహకరిస్తారా లేదా అని అనుమానం శ్రీధర్ రెడ్డిలో కనిపిస్తోంది.

ఈ వ్యవహారం ఇలా ఉండగానే బిజెపి, జనసేన తో పాటు, బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు.

Telugu Anamramnarayana, Ap, Chandrababu, Jagan, Janasena, Kotamreddy, Nellururur

శ్రీధర్ రెడ్డిని తమ పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారట.ముఖ్యంగా తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ఏపీలో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ బలమైన నాయకులను చేర్చుకుని పార్టీని మరింత పటిష్టం చేయాలనే ఆలోచనతో ఉంది.ఈ క్రమంలోనే నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో పాటు, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పాలని చూస్తోందట.

ఈ మేరకు శ్రీధర్ రెడ్డి తోను బీఆర్ఎస్ కీలక నేతలు మంతనాలు చేస్తున్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube