భార్య కంటే అభిమానులే ముఖ్యం.. ఆ విషయంలో తారక్ రియల్లీ గ్రేట్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ చిత్రయూనిట్ ను ట్రోల్స్ చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి.

 Junior Ntr Really Great In That Matter Details Here Goes Viral , Junior Ntr,ami-TeluguStop.com

నిన్న అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.ఏదైనా అప్డేట్ ఉంటే భార్య కంటే ఫ్యాన్స్ కు ముందుగా చెబుతానని ఎన్టీఆర్ అన్నారు.

మా ఫ్యామిలీలో ఎంతోమంది నటులు ఉన్నా ప్రయోగాత్మక సినిమాలలో ఎక్కువగా నటించిన హీరో మాత్రం కళ్యాణ్ రామ్ అని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.నేను జై లవకుశలో మూడు పాత్రలలో నటించానని మూడు రోల్స్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసని తారక్ అన్నారు.

అమిగోస్ లో అన్నయ్య అద్భుతంగా నటించారని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Amigos, Amigos Pre, Rajendra, Jai Lavakusa, Ntr, Kalyan Ram, Koratala Shi

డైరెక్టర్ రాజేంద్ర బీటెక్ చేశారని ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని పేరెంట్స్ సూచించగా సినిమా తీశాకే ఇంటికి వస్తానని చెప్పి ఆయన ఇండస్ట్రీకి వచ్చారని అయితే సినిమా పూర్తయ్యే సమయానికి తల్లి, తండ్రి చనిపోయారని తారక్ కామెంట్లు చేశారు.అప్ డేట్లు ఇవ్వాలంటూ దర్శకనిర్మాతలపై ఒత్తిడి పెంచొద్దని అదిరిపోయే అప్డేట్ ఉంటే మా భార్యల కంటే ముందు ఫ్యాన్స్ తో పంచుకుంటామంటూ తారక్ వెల్లడించారు.

Telugu Amigos, Amigos Pre, Rajendra, Jai Lavakusa, Ntr, Kalyan Ram, Koratala Shi

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ఈ నెలలోనే లాంఛనంగా మొదలవుతుందని మార్చి 20వ తేదీలోగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుందని షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు.ఈ అప్ డేట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.అభిమానులకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో తారక్ రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube