అవును, మీరు విన్నది నిజమే.అదొక పక్షి మాత్రమే, అయితేనేం… అది మనుషులవలె ప్రవర్తించగలదు.
పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెత దీనికి సరిగ్గా సరిపోతుంది.చూడటానికి చిన్నదే, కానీ దాని టాలెంట్ గురించి తెలిస్తే మీకు దిమ్మతిరిగి పోతుంది.
ఇంతకీ దాని ప్రత్యేకత ఏమిటంటే? అది ఎలాంటి శబ్దాన్ని అయినా ఇట్టే మిమిక్రీ చేసేస్తుంది.అదిగాని ఒక్కసారి ఏదన్న శబ్దం వింటే వెంటనే ఆ పక్షి లానే సౌండ్ చేయడం మొదలెడుతుంది.
కాగా ఈ బర్డ్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వావ్.ఇదేమి టాలెంట్, మైండ్ బ్లాక్ అని దానిని మెచ్చుకుంటున్నారు.ఇంతకీ ఆ పక్షి పేరు ఏమిటని అనుకుంటున్నారా? అదే లైర్ బర్డ్.లైర్‌బర్డ్ అనేది నేలపై నివసించే ఆస్ట్రేలియన్ జాతి పక్షి.ప్రకృతిలో వచ్చే సహజమైన శబ్దాలనే కాకుండా కృతిమమైన శబ్దాలను అనుకరించే సామర్థ్యం ఆ జాతి పక్షులకుంది.లైర్‌బర్డ్‌లు.తాము విన్న శబ్దాలను ఎంతో అలవోకగా అనుకరిస్తాయి అని చెబుతున్నారు అనిమల్ లవర్స్.
ఇక తాజాగా ఓ లైర్డ్ తాను విన్న శబ్దాలను వెంటనే అనుకరించడం ఓ వీడియోలో రికార్డ్ అయ్యింది.దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఆ పక్షి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఇంకేముంది లక్షల సంఖ్యలో సదరు వీడియోకి వ్యూస్ వస్తున్నాయి.అంతేకాకుండా ఒకరినుండి ఒకరికి షేర్ అవుతోంది ఆ వీడియో.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.వారెవ్వా ఏమి టాలెంట్! అని ఒకరు కామెంట్ చేస్తే, అమేజింగ్ టాలెంట్ అని ఒకరు, ఇది ప్లేయింగ్ బర్డ్ టెక్నోనా? అని వేరొకరు కామెంట్ చేసారు.మరికొంతమంది ‘అనుకరణలో ఇది చిలుకనే మించిపోయింది’ అని కామెంట్ చేయడం గమనార్హం.
ఇక లైర్డ్ బర్డ్.రైలు సైరన్ శబ్దాన్ని, ఈలను, సైరన్లను సౌండ్ చేయడం సదరు వీడియోలో మీరు గమనించవచ్చు.







